-
-
Home » Andhra Pradesh » Ananthapuram » tdp mla pedda reddy case
-
ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు
ABN , First Publish Date - 2020-12-27T06:51:06+05:30 IST
తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై శనివారం రాత్రి పోలీసులు రెండు, ఆయన ఇద్దరు కుమారులు, అనుచరులపై కేసులు నమోదు చేశారు.

తాడిపత్రి, డిసెంబరు26: తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై శనివారం రాత్రి పోలీసులు రెండు, ఆయన ఇద్దరు కుమారులు, అనుచరులపై కేసులు నమోదు చేశారు. జేసీ నివాసంలోకి చొరబడి, డ్రైవర్ సుబ్బరాయుడును కులం పేరుతో దూషించి, బెదిరించిన ఘటనలో పెద్దారెడ్డితో పాటు అనుచరులపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు నమోదు చేశారు. కంప్యూటర్ అపరేటర్ కిరణ్‌పై దాడిపై పెద్దారెడ్డితో పాటు అనుచరులపై కేసు నమోదు చేశారు. జేసీ ఇంటిపై రాళ్ల దాడికి దిగిన ఎమ్మెల్యే కుమారులు హర్షవర్దన్‌రెడ్డి, సాయిప్రతా్‌పరెడ్డి, అనుచరులపై జేసీ న్యాయవాది శ్రీనివాసులు ఇచ్చిన వివరాల ప్రకారం పోలీసులు కేసులు నమోదు చేశారు.