అవినీతిని ప్రశ్నించినందుకే సుబ్బయ్య హత్య

ABN , First Publish Date - 2020-12-30T06:12:18+05:30 IST

స్థానిక ఎమ్మెల్యే చేసే అవినీతిని ప్రశ్నించినందుకే కడప జిల్లా పొద్దుటూరులో టీడీపీకి చెందిన బీసీ నేత నందం సుబ్బయ్యను దారుణంగా హత్య చేశారని మాజీ మంత్రి, టీడీపీ అనంత పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు ఆరోపించారు.

అవినీతిని ప్రశ్నించినందుకే సుబ్బయ్య హత్య

ప్రభుత్వానిదే బాధ్యత.. మాజీ మంత్రి కాలవ

అనంతపురం వైద్యం, డిసెంబరు 29: స్థానిక ఎమ్మెల్యే చేసే అవినీతిని ప్రశ్నించినందుకే కడప జిల్లా పొద్దుటూరులో టీడీపీకి చెందిన బీసీ నేత నందం సుబ్బయ్యను దారుణంగా హత్య చేశారని మాజీ మంత్రి, టీడీపీ అనంత పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ సుబ్బ య్య హత్యను తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వమే సుబ్బయ్య హత్యకు బాధ్యత వహించాలన్నారు. అధికారం ఉందన్న అహంకారంతో వైసీపీ నాయకులు యథేచ్చగా నేరాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అనేక అక్రమాలకు పాల్పడుతున్నారనీ, వాటిపై పోరాడుతున్నందుకే బీసీ నాయకుడు సుబ్బయ్యను హత్య చేయించారన్నారు. ఎమ్మెల్యేతోపాటు అతడి బంధువు బంగారురెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని కాలవ డిమాండ్‌ చేశారు. హత్యారాజకీయాలకు ప్రజాస్వామ్యంలో చోటు లేదన్నారు. వైసీపీ దుర్మార్గాలను టీడీపీ సమర్థవంతంగా ఎదుర్కొంటుందని కాలవ ఉద్ఘాటించారు.


Updated Date - 2020-12-30T06:12:18+05:30 IST