పార్టీ అభివృద్ధికి సమష్టిగా సాగుదాం

ABN , First Publish Date - 2020-11-07T06:16:38+05:30 IST

టీడీపీ అభివృద్ధికి సమష్టిగా సాగుదామని అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ ఇనచార్జి జేసీ పవనకుమార్‌ రెడ్డి.. శ్రేణులకు పిలుపునిచ్చారు.

పార్టీ అభివృద్ధికి  సమష్టిగా సాగుదాం
మాట్లాడుతున్న జేసీ పవన

 కాలవ ప్రమాణ స్వీకారోత్సవాన్ని జయప్రదం చేద్దాం.. 

జేసీ పవనకుమార్‌ రెడ్డి పిలుపు


అనంతపురం వైద్యం, నవంబరు 6: టీడీపీ అభివృద్ధికి సమష్టిగా సాగుదామని అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ ఇనచార్జి జేసీ పవనకుమార్‌ రెడ్డి.. శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం అనంతపురంలోని లక్ష్మీనగర్‌లోఉన్న స్వగృహంలో పార్టీ శ్రేణులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం పని చేసిన వారికి గుర్తింపు ఉంటుందన్నారు. ఏ సమస్య వచ్చినా నేరుగా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేస్తే పార్టీకి పూర్వవైభవం వస్తుందన్నారు. శనివారం నిర్వహించనున్న టీడీపీ అనంపురం పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు ప్రమాణ స్వీకారోత్సవానికి పెద్దఎత్తున తరలి వచ్చి, జయప్రదం చేయాలని సూచించారు. సమావేశంలో నాయకులు బుగ్గయ్య చౌదరి, రాయల్‌ మురళి, కృష్ణకుమార్‌, చెన్నప్ప, గోపాల్‌రెడ్డి, శ్రీరాములు, శ్రీనివాసరెడ్డి, బాకే హబీబుల్లా, నాగముని, లక్ష్మీనరసింహ, వెంకటప్ప తదితరులు పాల్గొన్నారు.


టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సాయం

కరోనా తదితర అనారోగ్య సమస్యలతో మరణించిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు పార్టీ నేత జేసీ పవనకుమార్‌ రెడ్డి ఆర్థికసాయం అందజేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఐదుగురు కార్యకర్తల కుటుంబ సభ్యులకు రూ.10 వేల చొప్పున పంపిణీ చేశారు. 


Updated Date - 2020-11-07T06:16:38+05:30 IST