కరోనా నియంత్రణను సీరియస్‌గా తీసుకోండి

ABN , First Publish Date - 2020-04-07T09:45:42+05:30 IST

జిల్లాలో కరోనా వ్యాప్తి నియంత్రణకు సీరియ్‌సగా కృషి చేయాలని అధికా రులను రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖామంత్రి ఆళ్లనాని ఆదేశిం చారు. సోమవారం జిల్లాకు వచ్చిన ఆయన ఆర్థికశాఖా

కరోనా నియంత్రణను సీరియస్‌గా తీసుకోండి

కంట్రోల్‌ రూమ్‌ సమర్థవంతంగా పనిచేయాలి

ఇంటింటి సర్వేను త్వరగా పూర్తి చేయాలి

ఐసొలేషన్‌, క్వారంటైన్‌లో అన్ని వసతులు కల్పించాలి

అనుమానితులపై గట్టి నిఘా ఉంచాలి

క్షేత్రస్థాయిలో ర్యాపిడ్‌ బృందాలు చిత్తశుద్ధితో పనిచేయాలి

నిత్యావసర అధిక ధరలపై కఠిన చర్యలు తీసుకోండి

జిల్లా యంత్రాంగానికి ఆరోగ్యశాఖా మంత్రి ఆళ్లనాని ఆదేశం


అనంతపురం వైద్యం, ఏప్రిల్‌6 : జిల్లాలో కరోనా వ్యాప్తి నియంత్రణకు సీరియ్‌సగా కృషి చేయాలని అధికా రులను రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖామంత్రి ఆళ్లనాని ఆదేశిం చారు. సోమవారం జిల్లాకు వచ్చిన ఆయన  ఆర్థికశాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బీసీ సంక్షేమశాఖా మంత్రి శంకరనారాయణ, ఎంపీ గోరంట్ల మాధవ్‌, ఎమ్మె ల్యే అనంత వెంకటరామిరెడ్డిలతో కలిసి కలెక్టరేట్‌లో కరోనాపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా జిల్లాలో కరోనా పరిస్థితి, తీసుకుంటున్న చర్యలు ఐసొలేషన్‌లు, క్వారంటైన్స్‌ నిర్వహణ కంటైన్మెంట్‌ జోన్స్‌, పారిశుధ్య చర్యలు, లాక్‌డౌన్‌ ప్రోగ్రామ్‌, ఉద్యాన పంటలు ఎగుమతులు గురించి మంత్రి ఆళ్లనాని ఆరా తీశారు.


  జిల్లాలో కరోనా నియంత్రణకు తీసుకున్న తీసుకుంటున్న చర్యలు, ప్రస్తుత కేసులు, పరిస్థితులు, పారిశుధ్య పనులు, ఉద్యాన పంటల ఎగుమతులు తదితర అంశాలపై తమ నివేదికలను జిల్లా కలెక్టర్‌ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా విషయంలో ఏ ఒక్కరూ ఎక్కడా నిర్లక్ష్యం చేయరాదన్నారు. జిల్లాలో ఏర్పా టు చేసిన కంట్రోల్‌ రూమ్‌ సమర్థవంతంగా పనిచేయాల న్నారు. ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుని ఆయా ప్రాంతాలలో తగిన చర్యలు చేపట్టాలన్నారు. ఇంటింటా సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఐసొలేషన్‌ క్వారంటైన్‌లలో అన్ని వసతులు కల్పించాలన్నారు. బెడ్లు, అన్నం, తాగునీరు ఏర్పాటు చేయాలన్నారు. ఆయా కేంద్రా లను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఐసొలేషన్‌, క్వారంటైన్‌ లపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన ర్యాపిడ్‌ యా క్షన్‌ బృందాలు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు.


కరోనా బాధితులకు వైద్యసేవలు అందించే వైద్యులు, నర్సులు, టెక్నీషియన్స్‌, పారామెడికల్‌ సిబ్బంది, పారిశుధ్య కార్మికులకు మాస్క్‌లు, గ్లౌస్‌లు, పర్సనల్‌ ప్రొటెక్షన్‌ కిట్స్‌ అందజేయాలన్నారు. పాజిటివ్‌ కేసులు నమోదైన హిం దూపురం, లేపాక్షి కంటైన్మెంట్‌ ప్రాంతాలలో పారిశుధ్య చర్యలు, లాక్‌డౌన్‌ పటిష్టంగా చేపట్టాలన్నారు. రైతు బజారులో భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవా లన్నారు. నిత్యావసర సరుకులను అధిక ధరలకు అమ్మ కుండా చూడాలన్నారు. దుకాణాల ముందు విధిగా ధరల పట్టికను ప్రదర్శింపజేయించాలన్నారు. ఇతర జిల్లాలు, రా ష్ర్టాలకు చెందిన వారికి ఏర్పాటుచేసిన నిరాశ్రయుల కేంద్రాలలో ఆశ్రయం కల్పించి అన్ని సౌకర్యాలు కల్పించా లని సూచించారు. ఇతర జిల్లాలో అనంతపురం జిల్లా వారుంటే వారి కోసం ప్రతి జిల్లాకు ఒక స్పెషల్‌ ఆఫీస ర్‌ను నియమించి పంపించాలన్నారు. జిల్లాలో  ఉద్యాన పంటల ఎగుమతులు సమయంలో ఎక్కడా సమస్య తలె త్తకూడదన్నారు. అమ్మకాలు లేక ఏ ఉద్యానరైతు నష్టపో కూడదని మంత్రి ఆళ్లనాని ఆదేశించారు.


కార్యక్రమంలో జిల్లా స్పెషలాఫీసర్‌ బాబూరావునాయుడు, జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు, జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు, జేసీ  ఢిల్లీరావులతో పాటు పాఠశాలల విద్యా నియంత్రణ కమిటీ చైర్మన్‌ ఆలూరు సాంబశివారెడ్డి, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ అనిల్‌కుమార్‌, డీసీహెచ్‌ఎ్‌స డాక్టర్‌ రమే్‌షనాథ్‌, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామస్వామినాయక్‌, ఇతర శాఖాధికారులు పాల్గొన్నారు.

 


Updated Date - 2020-04-07T09:45:42+05:30 IST