-
-
Home » Andhra Pradesh » Ananthapuram » Take action against YCP candidates
-
వైసీపీ అభ్యర్థులపై చర్యలు తీసుకోండి
ABN , First Publish Date - 2020-04-07T09:43:02+05:30 IST
ప్రభుత్వ విప్ కా పు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ అభ్యర్థులు లాక్‌డౌన్ నిబంధనలను విచ్చలవిడిగా ఉల్లంఘిస్తూ

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు మాజీ మంత్రి కాలవ లేఖ
రాయదుర్గం, ఏప్రిల్ 6: ప్రభుత్వ విప్ కా పు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ అభ్యర్థులు లాక్‌డౌన్ నిబంధనలను విచ్చలవిడిగా ఉల్లంఘిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గు రిచేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌కు మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఫిర్యాదు చేశారు. సోమవారం ఆ యన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమే్‌షకుమార్‌కు వీడియోలు, ఫొటోలతో లేఖ పంపినట్లు తెలిపారు. పట్టణంలోని 29వ వార్డులో లాక్‌డౌన్ ని బంధనలకు విరుద్ధంగా వైసీపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహించారన్నారు. రూ.వెయ్యి నగదుతోపాటు కూరగాయల పంపిణీ ముసుగులో వైసీపీ కండువాలు ధరించిన అభ్యర్థులతో పంపిణీ చేశారన్నారు. ఓట్లు అభ్యర్థిస్తూ ప్రచారం చేయటం నేరంగా పరిగణించాలని కోరారు. 1వ వార్డులో వైసీపీ అభ్యర్థి కుమారుడు వార్డు వలంటీర్‌ను వెంట బెట్టుకుని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించార న్నారు.
10వ వార్డులో కూడా మాస్క్‌లను, కరపత్రాలను పంపిణీ చేసే ముసుగులో ఓట్లను అభ్యర్థిస్తూ లాక్‌డౌన్ నియమావళిను ఉల్లంఘించారన్నారు. కేంద్ర ప్రభు త్వ మార్గదర్శకాల నేపథ్యంలో వీరిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తాజా సవరణల ప్రకారం ఎన్నికల్లో అభ్యర్థులు అక్రమాలకు పాల్పడితే మూడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.పది వేలు జరిమానా విధించే వెసలుబాటు ఉందని లేఖలో వివరించారు. ఓట్లేయకపోతే పింఛన్లు, రేషన్ కార్డు లు, పక్కా ఇళ్ల బిల్లులు నిలిపివేస్తామని బెదిరిస్తున్నారన్నా రు.
ప్రభుత్వం ఇస్తున్న రూ.వెయ్యి సహాయాన్ని తామే ఇస్తున్నట్లు నమ్మబలికి ఓటర్లను ప్రభావితం చేస్తున్నారన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఫిర్యాదుపై ఎన్నికల కమిషన్ స్పందించి ఎన్నికల ప్రచారాలపై నిషేధం కొనసాగుతోంద నీ, ఎన్నికల ప్రక్రియ ఉల్లంఘనగా పరిగణిస్తామని చెప్ప టం ముదావహమన్నారు.