కడసారి చూపులకెళ్లి.. కానరాని లోకాలకు...
ABN , First Publish Date - 2020-09-16T18:34:15+05:30 IST
అయ్యప్ప మాలలు వేయించి... భక్తిమార్గం వైపు నడిపించిన గురుస్వామిని..

తాడిపత్రి వద్ద రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి
మృతులంతా అయ్యప్ప గురుస్వామి శిష్యులే...
తాడిపత్రి(అనంతపురం): అయ్యప్ప మాలలు వేయించి... భక్తిమార్గం వైపు నడిపించిన గురుస్వామిని కడసారి చూసేందుకు వెళ్లిన ముగ్గురు శిష్యులు తిరిగిరాని లోకాలకు వెళ్లారు. సోమవారం అర్ధరాత్రి తాడిపత్రి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. తాడిపత్రిలోని శ్రీరాములపేటకు చెందిన కిరాణాషాపు యజమాని వెంకటరంగయ్య (50), కృష్ణాపురం మూడో రోడ్డుకు చెందిన అయ్యప్ప గురుస్వామి జగన్నాథ్ భార్య హేమలత (50), ఎద్దులగేరికి చెందిన మేస్ర్తీ సుబ్రహ్మణ్యం (40) ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తిరుపతికి చెందిన గురుస్వామి మురళి అయ్యప్ప మాలధారులను తాడిపత్రి భక్తులకు పరిచయం చేశారు.
ఎంతోమందికి మాలలు వేసి శిష్యులుగా చేసుకున్నాడు. ఈక్రమంలో సోమవారం ఆయన తిరుపతిలో అనారోగ్యంతో మృతి చెందాడు. గురుస్వామిని కడసారి చూసేందుకు శిష్యులైన జగన్నాథ్, వెంకటరంగయ్య, సుబ్రహ్మణ్యంతో పాటు స్నేహితులు కలిసి అద్దెకు తుఫాన్ వాహనం తీసుకొని ఉదయం తిరుపతికి బయలుదేరి వెళ్లారు. అంత్యక్రియలు ఆలస్యం కావడంతో రాత్రి సమయంలో తిరుగు ప్రయాణమయ్యారు. తాడిపత్రికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉండగా వేగంగా వస్తున్న తుఫాన్ వాహనానికి హఠాత్తుగా రోడ్డుపై అడ్డంగా ఆవు వచ్చింది.
అప్రమత్తమైన డ్రైవర్ వాహనాన్ని కుడివైపునకు తిప్పాడు. ఇదే సమయంలో ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొంది. ఘటనలో తుఫాన్ వాహనం అల్లంత దూరంలో ఎడమవైపు ఉన్న రోడ్డుపక్కకు ఎగిరి పడి ంది. ముందుభాగం నుజ్జునుజ్జుయి టైర్లు ఊడిపోయాయి. ప్రమాదంలో వాహ నం వెనుకభాగంలో కూర్చు న్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెం దారు. సూర్యనారాయణ, శంకర్, జగన్నాథ్, సురేష్, ప్రసాద్, ఉమతో పాటు డ్రైవర్ శివప్రసాద్ గాయాలతో బయటపడ్డారు. వీరిలో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం తరలించారు.
అర్ధరాత్రి సహాయక చర్యలు
ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రమే్‌షరెడ్డి స్పందించారు. అనుచరులతో వెళ్లి వాహనంలో ఇరుక్కుపోయిన మృతదేహాలతోపాటు క్షతగాత్రులను అతికష్టం మీద బయటకు తీశా రు. బాధితులను చికిత్స ని మిత్తం ప్రత్యేక వాహనంలో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘట నా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన గన్నెవారిపల్లికాలనీ డ్రైవర్ శివప్రసాద్‌పై కేసు నమో దు చేసినట్లు సీఐ తెలిపారు. మంగళవారం ఉదయం ప్రభుత్వ ఆసుపత్రి బాధితుల కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులతో కిక్కిరిసిపోయింది. పోస్టుమార్టం జాప్యంతో వైసీపీ రాష్ట్రకార్యదర్శి రమే్‌షరెడ్డి పోలీసుల తీరుపై మండిపడ్డారు. వైద్యులను ప్రశ్నించారు. కాగా మృతుల కుటుంబసభ్యులను టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే తనయుడు కేతిరెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామని హామీఇచ్చారు.