-
-
Home » Andhra Pradesh » Ananthapuram » swamy speech
-
పుణ్యభూమి మనదేశం
ABN , First Publish Date - 2020-12-27T06:23:27+05:30 IST
ప్రపంచంలో అత్యంత పుణ్యప్రదమైన భూమి భారతదేశమేననీ, మరే దేశంతోనూ పోలిక లేదని పుష్పగిరి శారదా లక్ష్మీనృషింహ పీఠాధిపతి పరమహంస పరివ్రాజకాచార్య నృసిం హ భారతిస్వామి అన్నారు.

అనంతపురం టౌన్, డిసెంబరు 26: ప్రపంచంలో అత్యంత పుణ్యప్రదమైన భూమి భారతదేశమేననీ, మరే దేశంతోనూ పోలిక లేదని పుష్పగిరి శారదా లక్ష్మీనృషింహ పీఠాధిపతి పరమహంస పరివ్రాజకాచార్య నృసిం హ భారతిస్వామి అన్నారు. జిల్లా కేంద్రానికి శని వారం సాయంత్రం విచ్చేసిన ఆయనకు సోమనాథ్‌నగర్‌లో వేదపండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామి తొలు త వినాయక ఆలయాన్ని సదర్శించి, సోమనాథ్‌నగర్‌లో బీఎస్‌ఎన్‌ఎల్ విశ్రాంత ఉద్యోగి నాగరాజారావు నివాసంలో నిర్వహించిన సామూహిక విష్ణుసహస్రనామ పారాయణంలో పాల్గొన్నారు. అనంతరం ప్రశాంతినగర్‌లో వేదమాత గాయత్రి దేవాలయంలో భక్తులకు అనుగ్రహభాషణం చేశారు. విష్ణుసహస్రనామ పారాయణం మనిషిని అత్యున్నతుడిని చేస్తుందని పేర్కొన్నారు. అనంతరం తపోవనం చిన్మయా జగదీశ్వరాలయంలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. కార్యక్రమంలో శృంగేరి విరూపాక్ష మఠం పీఠాధిపతి విద్యానృసింహభారతి స్వామి, చిన్మయా మిషన్ ప్రతినిధి ఆత్మవిదానంద సరస్వతి, సాయి ట్రస్టు అధ్యక్షుడు విజయసాయికుమార్, ఎస్‌బీఐ విశ్రాంత చీఫ్ మేనేజర్ రవీంద్ర శర్మ తదితరులు పాల్గొన్నారు.