ఇద్దరు ఏఆర్‌ కానిస్టేబుళ్ల సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2020-05-18T10:15:04+05:30 IST

జిల్లా పోలీసు శాఖలో పనిచేస్తున్న ఇద్దరు ఏఆర్‌ కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేస్తూ జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు

ఇద్దరు ఏఆర్‌ కానిస్టేబుళ్ల సస్పెన్షన్‌

అనంతపురం క్రైం, మే 17 : జిల్లా పోలీసు శాఖలో పనిచేస్తున్న ఇద్దరు ఏఆర్‌ కానిస్టేబుళ్లను సస్పెండ్‌  చేస్తూ జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు ఆదివారం ఉత్తర్వులిచ్చారు. గుంతకల్లుకు చెందిన ఓ ప్రజాప్రతినిధి వద్ద గన్‌మన్‌గా పనిచేస్తున్న లక్ష్మన్ననాయక్‌కు గుంతకల్లులో మద్యం  అక్ర మార్కులతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో విచారణ చేసి సస్పెండ్‌ చేశారు.  హిందూపురంలో కరోనా విధుల్లో ఉన్న ఏఆర్‌ కానిస్టేబుల్‌ మల్లికార్జున మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో సస్పెండ్‌ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Updated Date - 2020-05-18T10:15:04+05:30 IST