వైద్యసేవలు, సౌకర్యాలపై నిఘా

ABN , First Publish Date - 2020-08-18T08:54:59+05:30 IST

జిల్లా లోని కొవిడ్‌ ఆస్పత్రులలో కరోనా బాధితులకు అందుతు న్న వైద్యసేవలు, సౌకర్యాల కల్పనపై సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేయనున్నట్టు కలెక్టర్‌ గంధం చంద్రు డు పేర్కొన్నారు. సోమవారం ఆయన కలెక్టరేట్‌లో ఏర్పా టు చేసిన 104 కమాండ్‌ కం

వైద్యసేవలు, సౌకర్యాలపై నిఘా

సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తామన్న కలెక్టర్‌

కలెక్టరేట్‌ నుంచి పరిశీలన


అనంతపురం, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి) : జిల్లా లోని కొవిడ్‌ ఆస్పత్రులలో కరోనా బాధితులకు అందుతు న్న వైద్యసేవలు, సౌకర్యాల కల్పనపై సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేయనున్నట్టు కలెక్టర్‌ గంధం చంద్రు డు పేర్కొన్నారు. సోమవారం ఆయన కలెక్టరేట్‌లో ఏర్పా టు చేసిన 104 కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో కొవిడ్‌ ఆస్ప త్రుల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీ లించారు. అక్కడి సిబ్బందితో కొవిడ్‌ ఆస్పత్రులకు సంబం ధించిన వివిధ అంశాలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 17 కొవిడ్‌ ఆస్పత్రులలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.


ఇప్పటికే పలు ఆస్పత్రుల్లో వీటిని ఏర్పాటు చేశామన్నారు. మిగిలిన వాటిలోనూ త్వరగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కొవిడ్‌ ఆస్పత్రుల్లో కరోనా బాధితులకు నాణ్యమైన వైద్యసేవలు, వేళకు భోజనం, ఇతరత్ర సౌకర్యాలు ఎలా అందుతున్నాయో జిల్లా కేంద్రం నుంచే పరిశీలించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సంబంధించి ఇన్‌స్టలే షన్‌, లైవ్‌ స్ర్టీమింగ్‌, నెట్‌ కనెక్టివిటీ తదితర అన్ని రకాల వసతులు కల్పించి త్వరగా అందుబాటులోకి తీసుకు రా వాలని అధికారులను ఆదేశించారు.


ఈ విషయంపై జీసీహెచ్‌ఎస్‌ రమేష్‌నాథ్‌తో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. జిల్లాలోని అన్ని ఆస్పత్రుల నుంచి లైవ్‌ స్ర్టీమింగ్‌ కనిపించేలా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. 104 కమాండ్‌ కంట్రోల్‌ రూములో డాక్టర్‌ను ఏర్పాటు చేయా లని సంబంధిత అధికారులను ఆదేశించారు.  కార్యక్రమం లో జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సిరి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సూర్య, డీసీపీహెచ్‌ శైలజా పాల్గొన్నారు.

Updated Date - 2020-08-18T08:54:59+05:30 IST