పట్టించుకోని పాలకులు...
ABN , First Publish Date - 2020-09-16T09:10:25+05:30 IST
నగరపాలక సంస్థ ద్వారా ప్రభుత్వానికి అన్ని రకాల పన్నులు చెల్లిస్తున్నాం.. అయినా తమ కాలనీల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయని పలు కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. గత 20ఏళ్లుగా రహదా

రహదారిలేక ప్రజల అవస్థలు
అనంతపురం క్లాక్‌టవర్, సెప్టెంబరు 15: నగరపాలక సంస్థ ద్వారా ప్రభుత్వానికి అన్ని రకాల పన్నులు చెల్లిస్తున్నాం.. అయినా తమ కాలనీల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయని పలు కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. గత 20ఏళ్లుగా రహదారి కోసం అధికారులు, ప్రజాప్రతినిధులను ఆశ్రయించినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదని వారు వాపోయారు. తమ కాలనీలకు రహదారి సౌకర్యా కల్పించాలని కోరుతూ హౌసింగ్‌బోర్డు కాలనీలోని రాజీవ్‌చిల్డ్రన్స్ పార్కు వెనుకవైపున నివాసముంటున్న స్థానికులు కలెక్టర్, ఎమ్మెల్యే, కమిషనర్లకు లేఖలు రాశారు. చిన్నపాటి వర్షం పడినా చాలు రోడ్లన్నీ బురదమయం అవతున్నాయని వాపోతున్నారు.
హౌసింగ్‌బోర్డు నుంచి ఆదర్శనగర్, హమాలీకాలనీ, భైరవనగర్ తదితర ప్రాంతాలకు ఇదే రహదారిపై వెళ్లాల్సి ఉంది. పాదచారులు, వాహనచోదకులు ఈ రహదారిలో వెళ్లాలంటే గ గనంగా మారింది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి రహదారి సౌకర్యం కల్పించాలని ప్రజలుకోరుతున్నారు.