-
-
Home » Andhra Pradesh » Ananthapuram » Support the affected farmers Janasena
-
నష్టపోయిన రైతులను ఆదుకోవాలి : జనసేన
ABN , First Publish Date - 2020-12-28T05:30:00+05:30 IST
జిల్లాలో నివర్ తుఫానుతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు చిలకం మధుసూదనరెడ్డి, రాయలసీమ సం యుక్త కమిటీ కన్వీనర్ టీసీ వరుణ్ పేర్కొన్నారు.

అనంతపురం క్రైం, డిసెంబరు 28: జిల్లాలో నివర్ తుఫానుతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు చిలకం మధుసూదనరెడ్డి, రాయలసీమ సం యుక్త కమిటీ కన్వీనర్ టీసీ వరుణ్ పేర్కొన్నారు. ఎకరాకి రూ.35 వేల చొప్పున పరిహారం మంజూరు చేయాలనీ, తక్షణ సాయం కింద రూ.10 వేలు అందించాలని డిమాండ్ చేశారు. పార్టీ అధినేత పవన కళ్యాణ్ అదేశా లు మేరకు.. సోమవారం నగరంలో ర్యాలీ ని ర్వహించి కలెక్టరేట్ లో డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు. ముందుగా చిలకం మధుసూదనరెడ్డి, టీసీ వ రుణ్ నేతృత్వంలో జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున ర్యాలీకి తరలివచ్చారు. స్థానిక సంగమేష్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు పలు నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భం గా వారిద్దరూ మాట్లాడుతూ నివర్ తుఫానుతో తీవ్రస్థాయిలో రైతులు నష్టపోయినప్పటీకి ప్రభుత్వం పట్టించుకోకపోవటం అన్యాయమన్నారు. ప్రభు త్వం తమ మొండి వైఖరిని మానుకుని వెంట నే బాధిత రైతులకు పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో బాధిత రైతులకు జనసేన పార్టీ అండగా నిలబడి దశల వారీగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో 14 నియోజకవర్గాల ఇనచార్జ్‌లు, నాయకులు పెండ్యాల హరి, ఈశ్వర్, బాబురావు, పద్మావతి, చలపతి, జయరామిరెడ్డి, సాకే పవనకుమార్, శ్రీకాంతరెడ్డి, మణికంఠ, బొంగరం శ్రీనివాస్, అబ్దుల్, మంజునాథ గౌడ్, సాకే మురళి, గౌతమ్, కుమార్, రాజేష్, హుస్సేన, నాగేంద్ర, పవనిజం రాజు పాల్గొన్నారు.