-
-
Home » Andhra Pradesh » Ananthapuram » Support the affected farmer families TDP
-
బాధిత రైతు కుటుంబాలను ఆదుకోవాలి: టీడీపీ
ABN , First Publish Date - 2020-12-30T06:29:22+05:30 IST
అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి మాదినేని ఉమామహేశ్వర్‌నాయుడు డిమాండ్ చేశారు.

కళ్యాణదుర్గం, డిసెంబరు 29: అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి మాదినేని ఉమామహేశ్వర్‌నాయుడు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ఎన్టీఆర్ భవన నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో 10 మంది రైతులు ఆప్పులబాధతో ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రూ.7 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి జగన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. కుటుంబ పెద్దను కోల్పోయి, భార్యాపిల్లలు పొట్టచేతపట్టుకుని వీధిన పడితే కనీసం పాలకులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. టీడీపీ ఆధ్వర్యంలో ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు కుటుంబాలను పరామర్శించి, అండగా నిలుస్తామన్నారు. అనంతరం ఆర్డీఓ రామ్మోహనకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు దొడగట్ట నారాయణ, మాదినేని మురళి, రాజశేఖర్‌చౌదరి, తలారి సత్యప్ప, మంజునాథ్‌రెడ్డి, నాగరాజు, వెంకటేష్, బిక్కి గోవిందరాజులు, ఓబులేష్, సుధాకర్‌నాయుడు, రాజు, నరసింహులు, నాత్యానాయక్ పాల్గొన్నారు.
పామిడి: పంటలు పండక అప్పులు ఎక్కువై దిక్కుతోచనిస్థితిలో ఆత్మహత్య చేసుకున్న అన్నదాతలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని అనంతపురం పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షుడు ఎంహెచ లక్ష్మీనారాయణ రెడ్డి కోరారు. మంగళవారం స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదుట టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టి, తహసీల్దారు చిన్నన్నకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం రైతులకు చేసింది ఏమీ లేదన్నారు. రైతులకు సకాలంలో సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, మందులు అందజేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ ముసలి రెడ్డి, నాయకులు నారాయణస్వామి, శ్రీనివాసులు, టీటీ రమణారావు, జింకల రామకృష్ణ, శివ, అబ్దుల్, వెంకటేశ, రాజేష్ నాయక్, తిమ్మప్ప పాల్గొన్నారు.
