-
-
Home » Andhra Pradesh » Ananthapuram » story about students
-
విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు
ABN , First Publish Date - 2020-12-30T06:13:55+05:30 IST
ఇంజనీరింగ్ మొదటి సంవత్సర ప్రవేశా లకు అడుగడుగునా అవాంతరాలు ఏర్పడుతున్నా యి. ఒకవైపు ప్రభుత్వం... మరోవైపు అధికా రుల తీవ్ర నిర్లక్ష్య ధోరణితో షెడ్యూల్ ప్రకారం ఆప్షన్ల ప్రక్రియ సజావుగా జరగడం లేదు. ప రీక్ష నిర్వహణ నుంచి సర్టిఫికెట్ల పరిశీలన వ రకు ప్రతి విషయంలోనూ విద్యార్థులను గం దరగోళానికి గురిచేస్తున్నారు.

ప్రైవేట్ కాలేజీలకు చెందిన వ్యక్తుల ఫోన్ నెంబర్లతో రిజిస్ర్టేషన్
సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకాని సంక్షేమ శాఖాధికారులు
సమస్యల వలయంలో విద్యార్థులు
అనంతపురం అర్బన్, డిసెంబరు 29: ఇంజనీరింగ్ మొదటి సంవత్సర ప్రవేశా లకు అడుగడుగునా అవాంతరాలు ఏర్పడుతున్నా యి. ఒకవైపు ప్రభుత్వం... మరోవైపు అధికా రుల తీవ్ర నిర్లక్ష్య ధోరణితో షెడ్యూల్ ప్రకారం ఆప్షన్ల ప్రక్రియ సజావుగా జరగడం లేదు. ప రీక్ష నిర్వహణ నుంచి సర్టిఫికెట్ల పరిశీలన వ రకు ప్రతి విషయంలోనూ విద్యార్థులను గం దరగోళానికి గురిచేస్తున్నారు. ఆప్షన్ల ప్రక్రియ విషయంలో ప్రవేట్ కళాశాలల యాజమాన్యాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు విద్యార్థుల అర్హత నిర్ధారించాల్సిన సంక్షేమ శాఖాఽధికారుల తీరుపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రవేట్ వ్యక్తుల చేతుల్లోకి విద్యార్థుల ఐడీ
ఎంసెట్ రిజిస్ర్టేషన్ నెంబరు, ఐడీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళుతున్నాయి. వారు పరీక్షా ఫలితాల్లో అర్హత సాధించిన విద్యార్థుల వి వరాలను గుట్టుగా సేకరించి, తమవారి నెంబర్లతో రిజిస్ర్టేషన్ చేసుకుంటున్నారు. దీంతో విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలన, ఆప్షన్ల ప్రక్రియకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ నెంబరు, ఐడీ వివరాలు నమోదు చేయలేక ఉ సూరుమంటున్నారు. ఈ- మెయిల్, సహాయ కేంద్రాల్లో సంప్రదించినపుడు ప్రైవేట్ కళాశాలలకు చెందిన వారి నెంబర్లతో రిజిస్ర్టేషన్ అయినట్లు చూపడంతో విస్తుపోతున్నారు. ఇదిలావుండగా.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత కల్గిన విద్యార్థుల ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి, నిర్ధారించాల్సిన సంక్షేమ శాఖాధికారులు కౌన్సెలింగ్ కేంద్రాలకు రావడంలేదు. అధికారుల నిర్లక్ష్యంతో విద్యార్థులు ఫీజు రీయింబర్స్ మెంట్‌ను కోల్పోవాల్సి వస్తోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హెల్ప్ ‘లెస్’ కేంద్రాలు..
జేఎఎన్‌టీయూ పరిధిలో ఒక ప్రభుత్వ ఇం జనీరింగ్ కళాశాలతోపాటు 76 ప్రైవేట్ ఇం జనీరీంగ్ కళాశాలలున్నాయి. వీటిలో వివిధ బ్రాంచులకుగాను దాదాపు 35వేల సీట్లు న్నాయి. వీటిని ఎంసెట్ ఫలితాల్లో అర్హత సాధించిన విద్యార్థులతో భర్తీ చేయాలి. ఎంసెట్ ఫలితాల అనంతరం చేపట్టే సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ల ప్రక్రియపై అరకొరగా హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటుచేసి విద్యార్థుల సమస్యలను పరిష్కరంచడంలో చేతులెత్తేస్తున్నారు. సర్వీసుల పేరు తో ఒక్కో విద్యార్థి నుంచి వందల రూపాయలు వసూలు చేశారని, అయితే ఆ కేంద్రాలు నేడు ఎలాంటి సహాయాన్ని అందించలేక హెల్ప్’లెస్’ కేంద్రాలుగా ఉన్నాయని విద్యార్థులు మండిపడుతున్నారు. ఉన్నత విద్యామండలి ఏర్పాటుచేసి న హెల్ప్‌లైన్ నెంబర్లును సంప్రదించినా సమస్యలు పరిష్కారం కాలేదంటున్నారు.
రేపటితో ముగియనున్న గడువు
ఇదిలా ఉండగా ఎంసెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం... ఈ నెల 28, 29వ తేదీల్లో ఒకటి నుంచి 60వేల ర్యాంకు వరకు అ భ్యర్థులు ఆప్షన్లు ఇచ్చుకోవాలి. అలాగే 30, 31వ తేదీల్లో 60001 నుంచి చివరి ర్యాంకు వరకు ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంది. బుధవా రం నాటికి మూ డు రోజులు ముగిసినట్లే. ఇక ఒరోజు మాత్రమే ఉంటుంది. అయితే సమస్యలను పరిష్కరించ డంలో ఉన్నత విద్యామండలి, యూనివర్శిటీ అధికారుల నిర్ల్యక్షం కారణంగా విద్యార్థులు నష్టపోవాల్సివస్తుందని తెలుస్తోంది. ఇదే అదనుగా ప్రైవే ట్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను వలలో వేసుకునేందుకు ప్రయత్నించని దారంటూలేదు. వెరసి ఇంజనీరింగ్ మొదటి తరగతిలో ప్రవేశించేందుకు అనేక సమస్యలను ఎ దుర్కోవాల్సివస్తోందని విద్యార్థులు వారి తల్లిదండ్రులు వాపోతున్నారు.