సర్వేల పేర్లతో పేదల కడుపు కొట్టొద్దు

ABN , First Publish Date - 2020-12-15T06:30:30+05:30 IST

సర్వేల పేర్లతో అర్హులైన పేదల కడుపు కొట్టొద్దని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ పేర్కొన్నారు. పట్టణంలో గతంలో పం పిణీ చేసిన ఇళ్లపట్టాల విషయంలో రీసర్వేకి 12 టీంలు ఏర్పాటు చేయడంతో సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే పయ్యాపుల కేశవ్‌, కలెక్టర్‌ గంధం చంద్రు డు, జాయింట్‌ కలెక్టర్‌ నిశాంత్‌ కమార్‌ను సోమవారం కలిశారు.

సర్వేల పేర్లతో పేదల కడుపు కొట్టొద్దు

ఎమ్మెల్యే పయ్యాపుల కేశవ్‌


ఉరవకొండ, డిసెంబరు 14: సర్వేల పేర్లతో అర్హులైన పేదల కడుపు కొట్టొద్దని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ పేర్కొన్నారు. పట్టణంలో గతంలో పం పిణీ చేసిన ఇళ్లపట్టాల విషయంలో రీసర్వేకి 12 టీంలు ఏర్పాటు చేయడంతో సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే పయ్యాపుల కేశవ్‌, కలెక్టర్‌ గంధం చంద్రు డు, జాయింట్‌ కలెక్టర్‌ నిశాంత్‌ కమార్‌ను సోమవారం కలిశారు. రాష్ట్రంలో ఎక్కడా సర్వే చేయడం లేదని, ఉరవకొండలోనే ఎందుకు సర్వే చేస్తున్నారని కలెక్టర్‌ను అడిగినట్లు తెలిపారు. కారణం లేకుండా అర్హులైన పేదలను తొలగించవద్దన్నారు. అలాగే ఇళ్ల పట్టాల విషయంపై ఆర్డీవో, తహసీల్దారుతో మా ట్లాడినట్లు తెలిపారు. అనంతరం ఆయన ఫోన్‌లో ఆంధ్రజ్యోతితో మాట్లాడు తూ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి  చెప్పిన విధంగా  చేస్తున్నారన్నారన్నారు. చేస్తే అన్ని సర్వే చేయాలి కానీ, ఎన్నిసార్లు సర్వే చేస్తారన్నారు. కేవలం టీడీపీ హయాంలో పేదలకు పట్టాలు పంపిణీ చేశారన్న ఉద్దేశంతోనే మాజీ ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారన్నారు. దీనికి సహకరించవద్దని అధికారులను కోరారు. పేద ల పట్టాలు తొలగిస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. రాజకీయంగా కోపం ఉంటే తన మీద చూపాలి కానీ, పేదల మీద కాదన్నారు. పేదల గూడు కట్టుకునే ఆ లోచనను రాజకీయాల కోసం వాడుకోవద్దని విశ్వేశ్వరెడ్డికి హితవు పలికారు.


Updated Date - 2020-12-15T06:30:30+05:30 IST