స్టార్‌ సీటీస్కాన్‌ సెంటర్‌ సీజ్‌

ABN , First Publish Date - 2020-09-06T09:56:47+05:30 IST

నిబంధనలు పాటించకుండా కొవిడ్‌ పరీక్షల పేరుతో సీటీ స్కాన్‌ చేస్తూ అధిక మొత్తంలో డబ్బు దండుకుంటున్న స్కానింగ్‌ సెంటర్లపై కలె

స్టార్‌ సీటీస్కాన్‌ సెంటర్‌ సీజ్‌

డబ్బు.. జబ్బు’పై కలెక్టర్‌ కొరడా..

నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరికలు..

జిల్లావ్యాప్తంగా తనిఖీలు చేస్తామని ఉద్ఘాటన..


అనంతపురం వైద్యం, సెప్టెంబరు 5: నిబంధనలు పాటించకుండా కొవిడ్‌ పరీక్షల పేరుతో సీటీ స్కాన్‌ చేస్తూ అధిక మొత్తంలో డబ్బు దండుకుంటున్న స్కానింగ్‌ సెంటర్లపై కలెక్టర్‌ గంధం చంద్రుడు కన్నెర్ర చేశారు. నేరుగా ఆయనే రంగంలోకి దిగి, జిల్లా కేంద్రంలోని స్టార్‌ సీటీ స్కానింగ్‌ సెంటర్‌ను శనివారం సీజ్‌ చేశారు. వారం రోజుల కిందట కరోనా ముసుగులో ప్రైవేట్‌ ఆస్పత్రులు, స్కానింగ్‌ సెంటర్లు చేస్తున్న దోపిడీపై డబ్బు.. జబ్బు.. శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించిన విషయం తెలిసిందే.


దీనిపై రాష్ట్ర, జిల్లా అధికారులు సీరియ్‌సగా స్పందించారు. కలెక్టర్‌.. స్కానింగ్‌ సెంటర్ల అక్రమాలు వెలికితీసేందుకు వైద్య శాఖాధికారులతో కమిటీలు వే యించి, విచారణ చేయించారు. అందులో జిల్లా కేంద్రంలో పలు స్కానింగ్‌ సెంటర్లు, డాక్టర్ల సలహా లేకుండానే సొంతంగా కరోనా నిర్ధారించేందుకని సీటీ స్కానింగ్‌ చేస్తున్నారనీ, అందుకు ఫీజులు కూడా అత్యధికంగా వసూలు చేస్తున్నట్లు విచారణలో కమిటీలు తేల్చాయి. ఈ నివేదికలను కలెక్టర్‌కు జిల్లా వైద్యాధికారి అందించారు. ఇందులో స్టార్‌ డయాగ్నొస్టిక్‌ సెంటర్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ సంఖ్యలో ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్‌లు చేసి నట్లు గుర్తించారు.


ఈ నేపథ్యంలో శనివారం జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు, వైద్యాధికారికామేశ్వరప్రసాద్‌, వైద్యశాఖ అధి కారులు సుజాత, అనుపమ, డెమో సిబ్బంది నాగరాజు, గంగాధర్‌, లక్ష్మీనరసమ్మ, రెవెన్యూ శాఖ నుంచి డిప్యూటీ తహసీల్దార్‌ పాల్గొ ని, పరిశీలించారు. రిసెప్షన్‌ కౌంటర్‌లోని కంప్యూటర్‌ రికార్డులను పరిశీలించి, వాస్తవమని మరోసారి గుర్తించా రు. దీంతో స్కానింగ్‌ సెంటర్‌ను సీజ్‌ చే యాలని కలెక్టర్‌ ఆదేశించారు. జిల్లా వైద్యాధికారి, డిప్యూటీ తహసీల్దార్‌ సమక్షంలో స్టార్‌ సీటీ స్కానింగ్‌ సెంటర్‌ను సీజ్‌ చేశారు.


జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేస్తాం: కలెక్టర్‌

       కరోనా ముసుగులో ప్రజలను దోపిడీ చేసున్న వారిని వదలమనీ, జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేసి, చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ గంధం చంద్రుడు హెచ్చరించారు, ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా నిర్ధారణ పరీక్షలు అవసరం లేకపోయినా కొన్ని స్కానింగ్‌ సెంటర్లలో సీటీ స్కాన్‌లు చేయటమే కాక ఇతర పరీక్షల పేరుతో అధికంగా డబ్బు దండుకుంటున్నారన్నారు.


ఫిర్యాదు రావటంతో అక్రమాలకు పాల్పడుతున్న సెంటర్లపై చర్యలు  తీసుకుంటున్నామన్నారు. డాక్టర్ల సలహాలు, రెఫరల్‌ లేకున్నా కొవిడ్‌ పరీక్షలు చేస్తున్నారన్నారు. అందులో భాగంగానే జిల్లా కేంద్రంలో స్కానింగ్‌ సెంటర్‌ను సీజ్‌ చేశామన్నారు, మిగిలిన ల్యాబ్‌లు, స్కానింగ్‌ సెంటర్లకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చామన్నారు.

Updated Date - 2020-09-06T09:56:47+05:30 IST