మార్కుల కంటే క్రమశిక్షణే ముఖ్యం
ABN , First Publish Date - 2020-02-08T11:39:52+05:30 IST
మార్కులు తగ్గి నా పర్వాలేదు కానీ పిల్లలకు అంతిమంగా క్ర మశిక్షణ నేర్పాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు హెచ్‌ఎంలు, ఎస్‌ఓలు, ప్రిన్సిపాళ్లకు సూచించారు.

కలెక్టర్ గంధం చంద్రుడు
అనంతపురం విద్య, ఫిబ్రవరి 7 : మార్కులు తగ్గి నా పర్వాలేదు కానీ పిల్లలకు అంతిమంగా క్ర మశిక్షణ నేర్పాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు హెచ్‌ఎంలు, ఎస్‌ఓలు, ప్రిన్సిపాళ్లకు సూచించారు. శుక్రవారం ఆర్డీటీ మైదానంలోని జూడో అకాడమీ ఆడిటోరియంలో విద్యాశాఖ ఆధ్వర్వంలో ఏర్పాటు చేసిన ఎస్‌ఎ్‌ససీ పబ్లిక్ పరీక్ష లు- సన్నద్ధం అన్న అంశంపై అన్ని యాజమాన్యాల ప్రధానోపాధ్యాయులు, ఎస్‌ఓలు, ప్రిన్సిపాళ్లతో సమీక్ష సమావే శం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆ యన మాట్లాడుతూ టెన్త్ పరీక్షల తర్వాత ఏదైనా సాధించగలమన్న నమ్మకంతో విద్యార్థులు బయటకు వెళ్లేలా తీర్చిదిద్దాలన్నా రు. ఉపాధ్యాయులు బోధన నుంచి కంటే వారిప్రవర్తన నుంచే విద్యార్థులు అధికంగా నేర్చుకుంటారన్నారు.
విద్య ఒక ఉద్యమంగా సాగాలని, స్కూళ్లు, విద్యను సం స్కరించే అవకాశం వచ్చిందన్నారు. నాణ్యమైన వి ద్యను, పరీక్షలను నిర్వహించే సారథులుగా ఉపాధ్యాయులు మారాలని ఆయన పిలుపునిచ్చారు. అంతకుముందు డీఈఓ శామ్యూ ల్ మాట్లాడు తూ తాను పనిచేసిన జిల్లాలో టెన్త్ ఫలితాల్లో 13 వ స్థానం వచ్చిందన్నారు. అయినా ఏనాడూ బాధపడలేదని, గర్వపడుతున్నాని తెలిపారు. కారణం పరీక్షలు నిజాయతీగా, పకడ్బందీగా నిర్వహించా న్న ఆత్మసంతృప్తి వచ్చిందన్నారు. 27వ తేదీ నుంచి ప్రీ ఫైనల్ జరుగుతాయని, అప్పటి నుంచి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలన్నారు. టెన్త్ పరీక్షల్లో కాపీల వల్ల ఉత్తమ స్థానం రాకపోయినా నిజాయతీగా పరీక్షలుపెట్టి...సమాజానికి ఉత్తమ విద్యార్థులను అందిద్దామని సూచించారు. సమగ్రశిక్ష ఏపీసీ రామచంద్రారెడ్డి, డీవై ఈఓలు లక్ష్మీనారాయణ, దేవరాజ్, పుష్పరాజ్, డీసీఈబీ సభ్యులు ఫణికుమార్ పరీక్షలపై పలు సూచనలు చేశారు.