ప్రత్యేక అలంకరణలో శ్రీవారి ఆలయం

ABN , First Publish Date - 2020-12-25T06:59:24+05:30 IST

ముక్కోటి ఏకాదశి సందర్భంగా పట్టణంలోని శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహాస్వామి వారి ఆలయాన్ని ముస్తాబు చేశారు.

ప్రత్యేక అలంకరణలో శ్రీవారి ఆలయం

కదిరి ,  డిసెంబరు 24: ముక్కోటి ఏకాదశి సందర్భంగా పట్టణంలోని శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహాస్వామి వారి ఆలయాన్ని ముస్తాబు చేశారు. శుక్రవారం ముక్కోటి ఏకాదశి కావడంతో పాలక మండలి, ఆలయ అధికారులు విస్తృత ఏర్పాటు చేశారు. అన్ని గోపురాలను విద్యుత దీపాలతో అలంకరించారు. ఉత్తర గోపురం ద్వారాన్ని వివిధ రకాల పుష్పాలతో మండపం కట్టి అలంకరించారు.  భక్తులు దర్శనం చేసుకోవడానికి క్యూలైనలు ఏర్పాటు చేశారు. భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈఓ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. 

Updated Date - 2020-12-25T06:59:24+05:30 IST