మోహన నారసింహుడు

ABN , First Publish Date - 2020-03-13T11:06:54+05:30 IST

మైమరపించే సోయగాలతో, చంకన అమృతభాండాగారం ధరించి మోహన రూపుడైన శ్రీవారిని దర్శించుకోవడానికి వేలా ది మంది భక్తులు తరలివచ్చారు.

మోహన నారసింహుడు

మోహినీ రూపంలో ఖాద్రీశుడు 

శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు 


కదిరి రూరల్‌, మార్చి 12 : మైమరపించే సోయగాలతో, చంకన అమృతభాండాగారం ధరించి మోహన రూపుడైన శ్రీవారిని దర్శించుకోవడానికి వేలా ది మంది భక్తులు తరలివచ్చారు. బ్ర హ్మోత్సవాల్లో భాగంగా గురువారం నారసింహుడు మోహినీ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంతో పాటు తిరువీధులు సందడిగా మారాయి. ఉదయం యాగశాలలో నిత్యపూజ, హోమం అ నంతరం గ్రామోత్సవాన్ని నిర్వహించారు. సంధ్యాసమయంలో మోహినీ అ లంకారం చేశారు. పాల కడలిని మదించిన అనంతరం ఉద్భవించిన అమృతాన్ని రాక్షసులకు దక్కకుండా చేయడానికి శ్రీమహావిష్ణువు మోహినీ అవతారం దాలుస్తారు. శ్రీమహావిష్ణు దశావతారాల్లో నారసింహ అవతారం కూడా ఒక్కటేనని భక్తులకు చాటడానికి నృసింహుడు మోహినీ అలంకారంలో కనువిందు చేస్తారు. బ్రహ్మోత్సవాల్లో అన్ని రోజుల్లోనూ శ్రీవారు తిరువీఽధుల్లో మాత్రమే విహరిస్తారు.


అయితే మోహినీ ఉత్సవం రోజు కోరిన భక్తుడి ఇంటికి వెళ్లి దర్శనమిచ్చారు. శనివారం రాత్రి ఆలయం నుంచి బయలుదేరిన శ్రీవారు తిరిగి ఆలయ్రపవేశం చేసేది శుక్రవారం మధ్యాహ్నానికే. కుచ్చుల వాల్జెడతో ఒయ్యారాలు పోతూ, మల్లెల సౌరభాలు వెంట రాగా మిరుమిట్లు గొలిపే విద్యుద్దీపకాంతుల అలంకరణలో ఉన్న శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ కాంబోజీ రెడ్డెప్ప శెట్టి, ఆలయ ధర్మకర్తలు, ఈఓ వెంకటేశ్వరెడ్డితో పాటు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.


నృసింహుడికి నేడు ప్రజా గరుడ సేవ 

బ్రహ్మోత్సవాల్లో భాగంగా  స్వామి వారు శుక్రవారం ప్రజా గరుడ  వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉదయం నిత్యపూజ, హోమం అనంతరం గ్రామ సేవ నిర్వహిస్తారు. సంధ్యాసమయంలో శ్రీవారు గరుడా రూఢుడై తిరువీధుల్లో ఊరేగనున్నారు. బ్రహ్మోత్సవాల్లో ఈ ఉత్సవానికి ఓ ప్రత్యేకత ఉంది. బ్రహ్మ గరుడ సేవను అన్ని బ్రహ్మోత్సవాల్లో ఒక్క రోజు మాత్రమే నిర్వహిస్తారు.  అయితే భక్తుల కోరిక మేరకు నిర్వహించే గరుడ ఉత్సవాన్ని ప్రజా గరుడ సేవ అని పిలుస్తారు. 

Updated Date - 2020-03-13T11:06:54+05:30 IST