డ్రోన్‌తో పంటకు మందు పిచికారి

ABN , First Publish Date - 2020-12-17T06:47:33+05:30 IST

మండలంలోని సొల్లాపురం గ్రామానికి చెందిన రైతు వెంకటేష్‌ చౌదరి డ్రోన్‌ సహాయంతో తాను సాగు చేసిన పప్పుశనగ పంటకు బుధవారం మందును పిచికారి చేసి ఇతరులకు ఆదర్శంగా నిలిచాడు

డ్రోన్‌తో పంటకు మందు పిచికారి
డ్రోన్‌ సాయంతో పంటకు పిచికారి చేస్తున్న దృశ్యం


కణేకల్లు, డిసెంబరు 16 : మండలంలోని సొల్లాపురం గ్రామానికి చెందిన రైతు వెంకటేష్‌ చౌదరి డ్రోన్‌ సహాయంతో తాను సాగు చేసిన పప్పుశనగ పంటకు బుధవారం మందును పిచికారి చేసి ఇతరులకు ఆదర్శంగా నిలిచాడు. 20 ఎకరాల పప్పుశనగ పంటకు ఏటా చిన్నపాటి ట్రాక్టర్‌ ద్వారా క్రిమిసంహారక మందును పిచికారి చేసేవాడు. దీంతో పంట కొంతమేర నష్టం కలిగేది. దీంతో  డ్రోన్‌ సహాయంతో పిచికారి చేయవచ్చని తెలుసుకొని తమిళనాడుకు చెందిన కొంతమందిని సంప్రదించాడు.  డ్రోన్‌ యంత్రాలను  గంటలకు రూ. 400 చొప్పున అద్దె చెల్లించి పంటకు మందు పిచికారి చేయించాడు.


Updated Date - 2020-12-17T06:47:33+05:30 IST