క్రిస్మ్‌సకు గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైళ్లు

ABN , First Publish Date - 2020-12-21T05:11:00+05:30 IST

క్రిస్మస్‌ పండుగను పురస్కరించుకుని గుంతకల్లు మీదుగా పలు నగరాలకు ప్రత్యేక రైళ్లను వేసినట్లు ఆదివారం రైల్వే అధికారులు తెలియజేశారు.

క్రిస్మ్‌సకు గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైళ్లు

గుంతకల్లు, డిసెంబరు20: క్రిస్మస్‌ పండుగను పురస్కరించుకుని గుంతకల్లు మీదుగా పలు నగరాలకు ప్రత్యేక రైళ్లను వేసినట్లు ఆదివారం రైల్వే అధికారులు తెలియజేశారు. యవ్వంతపూర్‌-జైపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (నెం.06521) ఈనెల 24వ తేదీన ఉదయం 11-30 గంటలకు బయలుదేరి గుంతకల్లుకు రాత్రి 8 గంటలకు చేరుకుని, మరుసటిరోజు ఉదయం 5-25 గంటలకు జైపూర్‌ వెళ్తుందన్నారు. తిరుగు ప్రయాణపు రైలు (నెం.06522) జైపూర్‌లో 26వ తేదీ రాత్రి 10-30 గంటలకు బయలుదేరి గుంతకల్లుకు మరుసటిరోజు ఉద యం 8-15 గంటలకు వచ్చి, యశ్వంతపూర్‌కు సాయంత్రం 6-10 గంటలకు చేరుతుందన్నారు. ఈ రైలు అజ్మీర్‌, బిల్వారా, వడోదర, సూరత్‌, పుణె, షోలాపూర్‌, రాయచూరు, గుంతకల్లు, బళ్లారి, చిత్రదుర్గం, అరిసికెర, తుమకూరు మీదుగా గమ్యానికి చేరుతుందన్నారు. య శ్వంతపూర్‌-అహ్మదాబాద్‌ రైలు (నెం.06502) ఈనెల 27న సాయంత్రం 4-45కు బయలుదేరి గుంతకల్లుకు రా త్రి 7-05కు వచ్చి, అహ్మదాబాద్‌ వెళ్తుందన్నారు. తి రుగు ప్రయాణపు రైలు (నెం.06501) అహ్మదాబాద్‌లో 29వ తే దీ సాయంత్రం 7 గంటలకు బయలుదేరి గుంతకల్లుకు  మరుసటిరోజు రాత్రి 9-40కు వచ్చి, యశ్వంతపూర్‌కు 31వతేదీ ఉదయం 4-45కు చేరుతుందన్నారు. ఈ రైలు హిందూపురం, ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు, ఆదో ని, రాయచూరు, వాడి, షోలాపూర్‌, డౌండ్‌, కోపర్‌గావ్‌, మన్మాడ్‌, జల్‌గావ్‌, సూరత్‌, వడోదర, అనంద్‌, తదితర స్టేషన్ల మీదుగా వెళ్తుందన్నారు. యశ్వంతపూర్‌-లాతూరు ఎక్స్‌ప్రెస్‌ (రైలు నెం.06583) 23న సాయంత్రం 7 గంటలకు బయలుదేరి గుంతకల్లుకు అర్ధరాత్రి 12-35 గంటలకు చేరుకుని, లాతూరుకు మధ్యాహ్నం 1-05 గంటలకు చేరుతుందన్నారు. తిరుగు ప్రయాణపు రైలు (నెం.06584) ఈనెల 24న మధ్యాహ్నం 3-45కు బీదర్‌లో బయలుదేరి గుంతకల్లుకు తెల్లవారుజాము 1-50కు వచ్చి యశ్వంతపూర్‌కు ఉదయం 7-40కు చేరుతుందన్నారు. ఈ రైలు యల్హంక, గౌరీబిదనూరు, హిందూపురం, ధర్మవరం, గుతకల్లు, రాయచూరు, సైదాపూర్‌, యాద్గిర్‌, నా ల్వార్‌, చిట్టాపూర్‌, వికారాబాద్‌, జహిరాబాద్‌, తదితర స్టేషన్ల మీదుగా వెళ్తుందన్నారు. హుబ్లీ-మైసూర్‌ (నెం. 06581) 23వ తేదీ సాయంత్రం 6-20 గంటలకు బయలుదేరి గుంతకల్లుకు రాత్రి 10-30 గంటలకు వచ్చి మైసూరు కు మరుసటిరోజు ఉదయం 9-20కు చేరుతుందన్నారు. తిరుగు ప్రయాణపు రైలు (నెం.06582) 23వ తేదీ సా యంత్రం 7 గంటలకు మైసూరులో బయలుదేరి గుంతకల్లుకు మరుసటి రోజు ఉదయం 4-45 గంటలకు వచ్చి, హుబ్లీకి ఉదయం 10-50 గంటలకు చేరుకుంటుందన్నారు. ఈ రైలు మాండ్యా, చన్నపట్నం, బెంగళూరు సిటీ, య ల్హంక, దొడ్డబళ్లాపూర్‌, హిందూపురం, ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు, బళ్లారి, తోరణగల్లు, హోస్పేట, మునిరాబాద్‌, కొప్పల్‌, గదగ్‌, తదితర స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుందన్నారు. యశ్వంతపూర్‌-బీదర్‌ రైలు (నెం.06271) ఈనెల 24న సాయంత్రం 7 గంటలకు బయలుదేరి గుం తకల్లుకు అర్ధరాత్రి 12-35 గంటలకు వచ్చి, బీదర్‌కు ఉ దయం 9-15గంటలకు చేరుతుందన్నారు. తిరుగు ప్రయాణపు రైలు (నెం. 06272) బీదర్‌లో 25వ తేదీ సాయం త్రం 6-15 గంటలకు బయలుదేరి గుంతకల్లుకు తెల్లవారుజాము 1-50 గంటలకు వచ్చి, యశ్వంతపూర్‌కు ఉద యం 7-40 గంటలకు చేరుకుంటుందన్నారు. ముంబై-చెన్నై (నెం.02163) డెయిలీ ఎక్సప్రెస్‌ రైలు జనవరి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకూ నడపనున్నట్లు తెలిపారు. ఈ రైలు లోకమాన్య తిలక్‌ స్టేషన్‌లో సాయంత్రం 6-45 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 8-25 గంటలకు గుంతకల్లుకు, సాయంత్రం 4-20 గంటలకు చెన్నై చేరుతుందన్నారు. తిరుగు ప్రయాణపు రైలు (నెం. 02164) జనవరి 2వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వర కూ రోజూ చెన్నైలో  సాయంత్రం 7-23 గంటలకు బయలుదేరి మరుసటిరోజు తెల్లవారుజాము 1-43 గంటలకు గుంతకల్లుకు, సాయంత్రం 3-40 గంటలకు ముంబై చేరుతుందన్నారు. ఈ రైలు థానే, కళ్యాణ్‌, పుణె, షోలాపూర్‌, వాడి, రాయచూరు, ఆదోని, గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, కోడూరు, రేణిగుంట, తి రుత్తణి, అరక్కోణం మీదుగా వెళ్తుందన్నారు.


Updated Date - 2020-12-21T05:11:00+05:30 IST