కోవిడ్‌-19పై సమరానికి స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌

ABN , First Publish Date - 2020-03-19T10:46:41+05:30 IST

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైర్‌స(కోవిడ్‌-19) నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంది.

కోవిడ్‌-19పై సమరానికి స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌

అనంతపురం క్రైం, మార్చి18 : ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైర్‌స(కోవిడ్‌-19) నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఇం దులో భాగంగా జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు బుధ వారం స్థానిక పోలీస్‌ కాన్ఫరెన్స్‌హాల్లో ప్రత్యేక సమా వేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. కరోనా వైరస్‌ బాధితులకు వైద్యచికిత్సలు అందించే ప్రాంతాల లో వైద్యులు,సిబ్బందికి ఇబ్బంది కలిగించకుండా ఉండేందుకు, ఐసోలేషన్‌ వార్డు నుంచి కరోనా వైరస్‌ బాధితులు పరారు కాకుండా నిఘా ఉంచడం, తదితర సేవలందించడం కోసం స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందా లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.


ఈ బృందాల సభ్యు లు ఎవరూ కరోనా వైరస్‌ బారిన పడకుండా తగిన భద్రతతో కూడిన (పర్సనల్‌ ప్రొటిక్టివ్‌ ఇక్వి్‌పమెంట్‌), శానిటేజర్లు, హైడ్రోక్లోరైడ్‌ ద్రావణాలు తదితర కిట్లను సిబ్బందికి అందజేశారు. అనంతరం వైద్యులచే స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందాలు, తదితర సిబ్బందికి కరోనా వైరస్‌ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తదితర అంశాలపై అవగాహన కల్పించడంతో పాటు ప్రదర్శన చేసి చూపించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రా మాంజినేయులు, ఏఆర్‌ డీఎస్పీ మురళీధర్‌, పీటీసీ వైద్యులు ఆదిశేషు, తిప్పయ్య, జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులు చంద్రశేఖర్‌రెడ్డి, రామచంద్ర, పరిపాలనాధి కారి శంకర్‌, ఆర్‌ఐలు సోమశేఖర్‌నాయక్‌, ఆనంద్‌రెడ్డి, పెద్దయ్య, రమణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-19T10:46:41+05:30 IST