శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే క్రిమినల్‌ కేసులు: ఎస్పీ

ABN , First Publish Date - 2020-12-30T06:16:50+05:30 IST

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటివారైనా క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని ఎస్పీ సత్యయేసుబాబు హెచ్చరించారు. మంగళవారం స్థానిక పట్టణ పోలీ్‌సస్టేషన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే క్రిమినల్‌ కేసులు: ఎస్పీ

తాడిపత్రి, డిసెంబరు 29: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటివారైనా క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని ఎస్పీ సత్యయేసుబాబు హెచ్చరించారు. మంగళవారం స్థానిక పట్టణ పోలీ్‌సస్టేషన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తాడిపత్రిలో జరిగిన ఘటనను సీరియ్‌సగా పరిగణిస్తున్నామన్నారు. ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదుమేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌, హత్యాయత్నం కేసులు నమోదుచేశామన్నారు. ఘర్షణలు పునరావృతం కాకుండా శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యక్తిగత న్యాయవాది శ్రీనివాసులు ఇచ్చిన సమాచారాన్ని ఫిర్యాదుగా పరిగణించి కేసులు నమోదు చేశామన్నారు. ఈ కేసులపై విచారణను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. సంఘటన జరిగిన రోజు డీఎస్పీ చైతన్య, ఎస్‌ఐ ప్రదీ్‌పకుమార్‌లు తక్కువమంది సిబ్బందితో సమర్థవంతంగా పనిచేశారని అభినందించారు. సోషల్‌మీడియాలో శాంతిభద్రతలకు వ్యతిరేకం గా పోస్టులు పెట్టిన వారిపై క్రిమినల్‌ కేసులు పెడతామన్నారు. గతం లో జిల్లాలో 9 మందిపై పీడీయాక్ట్‌ కింద కేసు నమోదుచేశామన్నారు. శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకొని మరికొందరిపై కూడా పీడీయాక్ట్‌ కింద కేసులు నమోదుచేసే అవకాశాలు లేకపోలేదన్నారు.
Updated Date - 2020-12-30T06:16:50+05:30 IST