జాతీయ స్థాయిలో ఎస్పీకి ప్రశంసలు
ABN , First Publish Date - 2020-12-01T06:24:12+05:30 IST
జిల్లా ఎస్పీకి జా తీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. లాక్‌డౌన్ సమ యంలో కరోనా విస్తరించకుండా ప్రజల ఇళ్ల వద్దకు ని త్యావసర సరుకులు, మందులు సరఫరా చేసే విధంగా సం బంధిత దుకాణాలు, యజమానులను ఎస్పీ ఒ ప్పించారు. ఇందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ప్రత్యేకంగా సువిధ యాప్‌ను రూపొందింపజేసి అమలు చేశారు.
ఆన్‌లైన్‌లో స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్
అవార్డు అందజేత
అనంతపురం క్రైం, నవంబరు 30: జిల్లా ఎస్పీకి జా తీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. లాక్‌డౌన్ సమ యంలో కరోనా విస్తరించకుండా ప్రజల ఇళ్ల వద్దకు ని త్యావసర సరుకులు, మందులు సరఫరా చేసే విధంగా సం బంధిత దుకాణాలు, యజమానులను ఎస్పీ ఒ ప్పించారు. ఇందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ప్రత్యేకంగా సువిధ యాప్‌ను రూపొందింపజేసి అమలు చేశారు. దీంతో ప్రజలు కూడా ఇళ్ల నుంచి బయటకు రాకుండా యాప్ ద్వారా అవసరమైన సమయాలలో వారి ఇంటి వద్దకే సరుకులు, కూరగాయలు, తదితర వ స్తువులను పొందారు. యాప్ ద్వారా సత్ఫలితాలు రావడంతో ఈ సేవలను గుర్తించి ఢిల్లీకి చెందిన స్కోచ్ గ్రూపు సంస్థ అవార్డు అందజేసింది. సోమవారం జిల్లా ఎస్పీకి జాతీయ స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డు ప్ర కటించి ఆన్‌లైన్‌లో అందజేశారు. దీంతో ఆయన జిల్లా పోలీసులు, రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. యాప్ రూపకల్పనలో స హకరించిన టెక్నికల్ విభాగం సీఐ హామీద్‌ఖాన్, ఎస్‌ఐ క్రాంతికుమార్, ఆర్‌ఎస్‌ఐ సురేష్‌రెడ్డి, యాప్ డెవలపర్ మణికంఠలను అభినందించారు.