తండ్రి హత్య కేసులో కొడుకు అరెస్టు

ABN , First Publish Date - 2020-11-13T06:17:03+05:30 IST

భూ తగాదాల్లో తండ్రిని హతమార్చిన కొడుకును గురువారం పోలీసులు అరెస్ట్‌ చేశారు.

తండ్రి హత్య కేసులో కొడుకు అరెస్టు

భూ తగాదాలే కారణం


ధర్మవరంరూరల్‌, నవంబరు12: భూ తగాదాల్లో తండ్రిని హతమార్చిన కొడుకును గురువారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. మండలంలోని రాంపురం గ్రామానికి చెందిన పతకమూరి నారప్ప (80) గతనెల 3వ తేదీన కొడుకు దాడి చేయడంతో మృతి చెందాడు. భూతగదాలతోనే అన్నదమ్ముల మధ్య ఘర్షణ తలెత్తడంతో తండ్రిని కుమారుడు పతకమూరి కాటమయ్య కడతేర్చినట్లు తేలింది. దీంతో గురువారం కాటమయ్యను అరెస్టు చేసినట్లు రూరల్‌ సీఐ చిన్నపెద్దయ్య తెలిపారు. స్థానిక పోలీ్‌సస్టేషన్‌లో ఆయన వివరాలు వెల్లడిం చారు. నారప్పకు కాటమయ్య, రవీంద్ర కుమారులతోపాటు ఒక కు మార్తె ఉంది. నారప్ప చిన్నకుమారుడు రవీంద్ర వద్దనే ఉంటున్నాడు. భూతగాదాలు, ఇంటిస్థలం వద్ద అన్నదమ్ముల మధ్య ఘర్షణ పడు తుండటంతో అక్కడికి వెళ్లిన తండ్రి నారప్పను కాటమయ్య కాళ్లతో తన్ని కిందకు తోసేసి దాడిచేయడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడన్నారు. విషయం తెలుసుకున్న రూరల్‌ సీఐ చిన్నపెద్దయ్య, ఎస్‌ఐ జనార్ధన్‌నాయుడు ఘటనా స్థలానికి చేరుకుని, పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న కాటమయ్యను రాబడిన సమాచారం మేరకు గొల్లపల్లి క్రాస్‌ వద్ద అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు.


Updated Date - 2020-11-13T06:17:03+05:30 IST