నిందితులపై కాకుండా బాధితులపై కేసులా?: సోమిరెడ్డి

ABN , First Publish Date - 2020-12-30T21:58:51+05:30 IST

రాష్ట్రంలో వ్యవస్థలు ఎమ్మెల్యేల చేతుల్లోకి వెళ్లిపోయాయని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు

నిందితులపై కాకుండా బాధితులపై కేసులా?: సోమిరెడ్డి

అనంతపురం: రాష్ట్రంలో వ్యవస్థలు ఎమ్మెల్యేల చేతుల్లోకి వెళ్లిపోయాయని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జేసీ ప్రభాకర్‌రెడ్డిని మాజీ మంత్రులు సోమిరెడ్డి, అమర్నానాథ్‌రెడ్డి పరామర్శించారు. అనంతరం సోమిరెడ్డి మాట్లాడారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంట్లోకి ప్రవేశించిన వారిపై కేసులు నమోదు చేయకుండా జేసీ ఫ్యామిలీపైనే కేసులు పెట్టడం ఏంటి? అని ప్రశ్నించారు. తప్పుచేసిన వారిపై కేసులు పెట్టకుండా బాధితులపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కలెక్టర్, ఎస్పీ బలహీనులు అయిపోయారని విమర్శించారు. 


మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి...

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వ్యవస్థలను అడ్డుపెట్టుకుని నడుపుతున్నారని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి విమర్శించారు. న్యాయవ్యవస్థను కించపరుస్తున్నారని.. అలాగే జడ్జిలను దూషిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయన్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తే లోపల వేసి నాశనం చేస్తున్నారన్నారు. అవినీతిని ప్రశ్నిస్తే చంపుతారా?  అని ప్రశ్నించారు. జేసీ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Updated Date - 2020-12-30T21:58:51+05:30 IST