అధికారులకు అవమానం!

ABN , First Publish Date - 2020-12-28T06:02:48+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు, మర్యాదలు ఇవ్వకపోవటం ఇటీవలిగా సర్వసాధారణమ య్యాయి. తాజాగా మండలంలోని ఇద్దరు ముఖ్య అధికారులకు ఏ మాత్రం గౌరవం దక్కలేదు.

అధికారులకు అవమానం!
కుర్చీలు లేకపోవటంతో వేదికపై నిలుచున్న ఎంపీడీఓ, తహసీల్దార్‌

అనంతపురం రూరల్‌, డిసెంబరు 27: ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు, మర్యాదలు ఇవ్వకపోవటం ఇటీవలిగా సర్వసాధారణమ య్యాయి. తాజాగా మండలంలోని ఇద్దరు ముఖ్య అధికారులకు ఏ మాత్రం గౌరవం దక్కలేదు. ఎంపీడీఓ భాస్కర్‌రెడ్డి, ఆయన వెనుకనే తహసీల్దార్‌ లక్ష్మీనారాయణరెడ్డికి కనీసం కూర్చునేందుకు వీలుగా కుర్చీలు కూడా వేయకుండా వైసీపీ నాయకులే వేదికను పంచుకున్నారు. ఆదివారం మండలంలోని కొడిమి గ్రామ సమీపంలో ఎ.నారాయణపురం, రాజీవ్‌కాలనీ పంచాయతీల పరిధిలోని లబ్ధిదారులకు ఇళ్లపట్టాల పంపిణీ చేపట్టారు. ఈక్రమంలోనే పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. స్టేజ్‌పై ఎంపీ ఇద్దరు ఎమ్మెల్యేలు, మా ర్కెట్‌ యార్డు, కార్పొరేషన అధ్యక్షులు, డైరెక్టర్లు హోదా ఉన్నావారందరూ ఆశీనులయ్యారు. వారితోపాటు ఎలాంటి పదవులు లేనివారు, చోటా మోటా నాయకులకు సైతం మర్యాదాలు దక్కాయి. ఆ కార్యక్రమం సజావుగా సాగాడానికి కారణమైన అధికారులకు మాత్రం కనీస గౌరవం లేకుండా పోయింది. ఎంపీడీఓ, తహసీల్దార్లు కార్యక్రమం ఆద్యంతం అలా నిలుచుకోవటం గమనార్హం.Updated Date - 2020-12-28T06:02:48+05:30 IST