తండ్రి ముందే కూతురి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో.. అవమానభారంతో..

ABN , First Publish Date - 2020-03-04T17:51:32+05:30 IST

తనబిడ్డను వేధిస్తున్న వాడిని కట్టడి చేయలేక మనోవేదనకు..

తండ్రి ముందే కూతురి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో.. అవమానభారంతో..

విద్యార్థినిపై వేధింపులు 

అవమానభారంతో తండ్రి ఆత్మహత్యాయత్నం


కణేకల్లు(అనంతపురం): తనబిడ్డను వేధిస్తున్న వాడిని కట్టడి చేయలేక మనోవేదనకు గురైన ఓ తండ్రి (45) ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన కణేకల్లు మండలంలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు.. ఆ గ్రామానికి చెందిన సురేష్‌రెడ్డి అనే యువకుడు పదమూడేళ్ల విద్యార్థినిని వేధిస్తూ వస్తున్నాడు. ఆ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న ఆ విద్యార్థినిపై సురేష్‌రెడ్డి అనే ఆటోడ్రైవర్‌ కన్నేసి నెలలుగా వెంటపడుతున్నాడు.


నువ్వంటే నాకిష్టం, నన్ను ప్రేమించాలనీ అసభ్యకరంగా ప్రవర్తిస్తూ మానసిక క్షోభకు గురి చేస్తున్నాడు. చివరకు బాలిక ఇంటి సెల్‌ నెంబర్‌ గుర్తించి ఫోను ద్వారా బెదిరిస్తూ వచ్చాడు. విషయాన్ని తల్లిదండ్రులకు  తెలపడంతో వెంటనే పోలీస్‌ స్టేషన్‌కు ఆశ్రయించి  ఫిబ్రవరి 28న స్టేషన్‌లో సురేష్‌రెడ్డికి కౌన్సిలింగ్‌ ఇప్పించారు. కొద్ది రోజుల తర్వాత మళ్లీ వేధింపులు ప్రారంభించాడు. దీంతో పాటు ఏకంగా బాలిక తండ్రి ముందే మీసం మెలేసి కూతురి పట్ల అసభ్యకరంగా వ్యవహరించాడు.


దీనిని చూసి జీర్ణించుకోలేని తండ్రి ఆ పోకిరీ వెనుక ఉన్న రాజకీయ పలుకుబడి వల్ల ఏమీ చేయలేనని భావించి మానసికంగా కృంగి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చుట్టుపక్కల వారు గుర్తించి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్సలు చేయించారు. దీంతో బాధితుడి బంధువులు కోపోద్రిక్తులై స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్‌ఐ సురేష్‌ను వివరణ కోరగా.. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని వివరించారు.

Updated Date - 2020-03-04T17:51:32+05:30 IST