మొక్కజొన్నకు కత్తెరపురుగు ఆశింపు
ABN , First Publish Date - 2020-08-12T08:09:28+05:30 IST
మండలంలో చాలా మంది రైతులు ఈ ఖరీ్‌ఫలో అష్టకష్టాలు పడి మొక్కజొన్న సాగు చేశా రు. వర్షాలు ఆశాజనకంగా పడుతుండడం తో

మడకశిర రూరల్, ఆగస్టు 11: మండలంలో చాలా మంది రైతులు ఈ ఖరీ్‌ఫలో అష్టకష్టాలు పడి మొక్కజొన్న సాగు చేశా రు. వర్షాలు ఆశాజనకంగా పడుతుండడం తో పంటలు బాగా పండుతాయని ఆశ పడ్డారు. అయితే పంటకు పెద్దఎత్తున కత్తెర పురుగు సోకడంతో వారి ఆశలు ఎంతో కాలం నిలవలేదు.
మండలంలో దాదాపు 200 ఎకరాల్లో పైగా మొక్కజొన్న సాగు చేశారు. తక్కువ పెట్టుబడి, తక్కువ సమయంలో అధిక దిగుబడినిచ్చే పంట కావడంతో పాటు పశువులకు గ్రాసం కూడా దక్కుతుంది. దీంతో చాలామంది రైతులు ఈ పంటపై మొగ్గు చూపారు. నిత్యం మిరప పంట వేసే రైతులు కూడా ఈ సారి మొక్కజొన్న సాగు చేశారు. అయితే కత్తెర పురుగు భారిన పడి పంట దెబ్బ తింటుండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఈ సారైనా గట్టుక్కుతామనుకున్నామని, అయితే ఆశలు ఆవిరయ్యాయని పలువురు కంటనీరు పెడుతున్నారు. వ్యవసాయాధికారులు వెంటనే స్పందించి కత్తెర పురుగు నివారణకు త్వరితగతిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
దీనిపై మండల వ్యవసాయాధికారి తిమ్మప్పను వివరణ కోరగా కత్తెర పురుగు నివారణకు రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వనున్నట్లు తెలిపారు.
మిరపకు ప్రత్యామ్నాయంగా.. మొక్కజొన్న సాగుచేశాం....
గతంలో మా గ్రామంలో చాలామంది రైతు లు మిరప సాగు చేసేవారు. అయితే ఈ యేడు తక్కువ పెట్టుబడి, తక్కువ సమయంలో అధిక దిగుబడినిచ్చే మొక్కజొన్న పంటను సాగుచేశాం. పంట చేతికొచ్చే స మయంలో కత్తెర పురుగు ఆశించడంతో నష్టపో యే దుస్థితి నెలకొంది. ప్రభుత్వం ఆదుకోవాలి
వెంకటరంగారెడ్డి, రైతు,
సీ.కొడిగేపల్లి