ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ లక్ష్మానాయక్‌కు డీడీగా పదోన్నతి - బదిలీ

ABN , First Publish Date - 2020-03-24T10:27:11+05:30 IST

ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ లక్ష్మానాయక్‌కు డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి కల్పిస్తూ ఆ శాఖ సోమవా రం ఉత్తర్వులు జారీ చేసింది.

ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ లక్ష్మానాయక్‌కు డీడీగా పదోన్నతి - బదిలీ

అనంతపురం క్లాక్‌టవర్‌, మార్చి 23 : ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ లక్ష్మానాయక్‌కు డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి కల్పిస్తూ ఆ శాఖ సోమవా రం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఆయన ఎ స్సీ కార్పొరేషన్‌ ఈడీగా, జిల్లా గిరిజన సంక్షేమశాఖ ఇన్‌చార్జి అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో డీడీగా పదోన్నతి క ల్పిస్తూ ప్రకాశం జిల్లాకు బదిలీ చేశారు. స్థానికంగా ఖాళీ అయిన పదవుల్లో ఎవరినీ నియమించలేదు. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్‌ ఈ ఓ ప్రసాద్‌రావుకు జాయింట్‌ సెక్రటరీగా పదోన్నతి కల్పిస్తూ విజయవాడకు బదిలీ చేశారు.

Read more