ఘనంగా సత్యసాయి గిరి ప్రదర్శన
ABN , First Publish Date - 2020-12-30T06:39:18+05:30 IST
సత్యసాయి గిరిప్రదర్శన పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం ప్రశాంతినిలయం గణేశ్‌గేటు వద్ద సత్యసాయి రథాన్ని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు.
పుట్టపర్తి, డిసెంబరు 29: సత్యసాయి గిరిప్రదర్శన పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం ప్రశాంతినిలయం గణేశ్‌గేటు వద్ద సత్యసాయి రథాన్ని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం రథాన్ని లాగుతూ పాటలు పాడుతూ ప్రదర్శనను నిర్వహించారు. గిరిప్రదర్శన గోకులం, ఎనుములపల్లిసర్కిల్, పెట్రోల్‌బంక్, చింతతోపు, గోవిందపేట, శివాలయం వీధి, గోపురం రోడ్డు మీదుగా తిరిగి గణేశ్‌గేటు వద్దకు చేరుకుంది. మంగహారతితో గిరిప్రదర్శనను ముగించారు.