ఘనంగా వేణుగోపాల స్వామి రథోత్సవం

ABN , First Publish Date - 2020-11-19T06:10:12+05:30 IST

ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో వేణుగోపాలస్వామి రథోత్సవం కనులపండువగా సాగింది. సత్యసాయిబాబా 95వ జయంత్యుత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి.

ఘనంగా వేణుగోపాల స్వామి రథోత్సవం
సీతారాముల పల్లకి మోస్తున్న ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి, ఆర్‌జే రత్నాకర్‌, పక్కనే మాజీ మంత్రి పల్లె

సత్యసాయిబాబా జయంత్యుత్సవాలు ప్రారంభం

పుట్టపర్తి, నవంబరు 18: ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో వేణుగోపాలస్వామి రథోత్సవం కనులపండువగా సాగింది. సత్యసాయిబాబా 95వ జయంత్యుత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉద యం 9 గంటలకు పెదవెంకమరాజు కల్యాణమండపంలో వేణుగోపాలస్వామి ర థాన్ని, సాయి కుల్వంత్‌ మందిరంలో సీతారాముల పల్లకి, వేణుగోపాలస్వామి పల్లకీలకు ప్రత్యేక పూజలు చేసి, ప్రశాంతి గోపురం వద్దకు తీసుకొచ్చారు. వేణుగోపాలస్వామి ఉత్సవ విగ్రహాన్ని రథంలో ఉంచి పూజలు చేశారు. సత్యసాయి విద్యార్థులు, భక్తులు సీతారాముల పల్లకీని మోస్తూ భక్తిపాటలతో ముందు నడవగా రథోత్సవం సాగింది. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు సభ్యుడు ఆర్‌జే రత్నాకర్‌ సీతారాముల పల్లకిని మోశారు. సాయిగీత స్కూల్‌ విద్యార్థినులు కలశాలతో  పాల్గొన్నారు. తిరిగి రథాన్ని పెదవెంకమరాజు కల్యాణమండపం వద్దకు తీసుకెళ్లి, మంగళహారతితో రత్నాకర్‌ రథోత్సవాన్ని ముగించారు. సాయి కుల్వంత్‌ హాల్‌లో సత్యసాయి వ్ర తం నిర్వహించారు. సత్యసాయిబాబా జయంతికి ప్రభుత్వ పరంగా ఏర్పా ట్లు పూర్తి చేసినట్లు ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. పూజ ల్లో ప్రజాప్రతినిఽధులతోపాటు ట్రస్టు సభ్యులు ప్రసాదరావు, చక్రవర్తి, పరిమితంగా భక్తులు పాల్గొన్నారు. సత్యసాయిబాబా.. మానవాళికి అందించిన సేవలు వెలకట్టలేనివని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కొనియాడారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారి నిశాంత్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ శి వరామిరెడ్డి, నాయకులు కోటాసత్యం, చెన్నకేశవులు, సత్యసాయి సేవాదళ్‌ తెలుగు రాష్ట్రాల అధఽ్యక్షుడు చలం పాల్గొన్నారు.

Updated Date - 2020-11-19T06:10:12+05:30 IST