కేంద్రంపై కార్మిక సంఘాల కన్నెర్ర

ABN , First Publish Date - 2020-11-26T06:31:11+05:30 IST

ప్ర ధాని నరేంద్రమోదీ ప్రభుత్వంపై కార్మిక సంఘాలు కన్నెర్రజేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలపై మండిప డుతున్నాయి.

కేంద్రంపై కార్మిక సంఘాల కన్నెర్ర

నేడు దేశవ్యాప్త సమ్మె

అనంతపురం, నవంబరు25 (ఆంధ్రజ్యోతి): ప్ర ధాని నరేంద్రమోదీ ప్రభుత్వంపై కార్మిక సంఘాలు కన్నెర్రజేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలపై మండిప డుతున్నాయి. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో గురువారం జిల్లాలో సార్వత్రిక సమ్మెకు కార్మిక సంఘాలన్నీ సం ఘటితమయ్యాయి. కమ్యూనిస్టులు, కాంగ్రె్‌సతోపాటు ఆయా పార్టీల అనుబం ధ కార్మికసంఘాలు సమ్మెలో పాల్గొననున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగసంస్థలు బీఎ్‌సఎన్‌ఎల్‌, ఎల్‌ఐసీ, తపాలా, రైల్వే, బ్యాంకింగ్‌, విమానయానంతోపాటు ఆర్టీసీ కార్మికులు సైతం ప్రత్యక్ష పోరాటంలో భాగస్వాములవుతున్నారు. కార్మికచట్టాల సవరణ, వ్యవసాయ బిల్లులు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఆటో కార్మికులపై పన్నుల పోటు, ఇంధన ధరల పెంపు, ఉద్యోగ, కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలుసహా 38 డిమాండ్ల సాధన కోసం కార్మిక సంఘాలు సమ్మె కు పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వ రంగసంస్థల ఉద్యోగులు, కార్మికులు వారి వారి కార్యాలయాల్లో విధులను బహిష్కరించి, ఆందోళన చేపట్టనున్నారు. ఆ టో కార్మికులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనేలా ఆయా కార్మిక సంఘాల నాయకులు సమాయత్తం చేశారు.

Updated Date - 2020-11-26T06:31:11+05:30 IST