ఇంటి పట్టాల లేఅవుట్ల పనులు వేగవంతం చేయండి

ABN , First Publish Date - 2020-03-02T10:28:07+05:30 IST

ఉగాది నాటికి ఇంటి పట్టాలు ఇచ్చేందుకు చేపడుతున్న లేఅవుట్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌ అధికారులను ఆదేశించారు.

ఇంటి పట్టాల లేఅవుట్ల పనులు వేగవంతం చేయండి

సీఎంఓ సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌


హిందూపురం, మార్చి 1: ఉగాది నాటికి ఇంటి పట్టాలు ఇచ్చేందుకు చేపడుతున్న లేఅవుట్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌ అధికారులను ఆదేశించారు. ఆది వారం ఆయన చిలమత్తూరు మండలం టేకులోడు, కో డూరు, గోరంట్ల మండలం మల్లాపల్లి, గుమ్మయ్యగారిపల్లి, పెనుకొండ పట్టణంలోని అర్బన్‌ కాలనీ, కొండంపల్లి గ్రా మాలలో ఇంటి పట్టాల కోసం సేకరించిన భూముల్లో లే అవుట్ల ఏర్పాటు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అర్హులైన ప్రతి పేదవాడి సొంతింటి కల నిజం చేయాలనేదే ముఖ్యమంత్రి ధ్యేయ మని అందుకే ఉగాది పండుగ రోజున అర్హులైన పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. ప్రతి మండలంలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు అవసరమైన భూమిని సేకరించి, వాటిని చదును చేసి, లేఅవుట్లు ఏర్పాటు చేసి, ప్లాట్లకు రాళ్లను నాటి వాటిపై నెంబర్లు వేయాలన్నారు. పింఛన్ల పంపిణీ తీరు ను పరిశీలించారు. పెనుకొండ సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు, జేసీ ఢిల్లీరావు, ట్రైనీ కలె క్టర్‌ జాహ్నవి, సబ్‌కలెక్టర్‌ నిశాంతితో కలిసి నియోజకవర్గ ప్రత్యేక అఽధికారులు, తహసీల్దార్‌తో సమావేశం నిర్వహిం చారు. ఈసందర్భంగా ఏఏ మండలాల్లో ఎంతమంది లబ్ధి దారులకు ఇంటి పట్టాలు ఇస్తున్నారు? ఎక్కడెక్కడ స్థలాల ఎంపిక చేశారు? తదితర విషయాలపై తహసీల్దార్‌ను అడిగి తెలు సుకున్నారు.

Updated Date - 2020-03-02T10:28:07+05:30 IST