తక్కువ ధరకే మాస్కుల విక్రయాలు

ABN , First Publish Date - 2020-03-25T11:09:15+05:30 IST

డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో జిల్లాలో తక్కువ ధరకే మాస్కులు విక్రయించను న్నట్లు కలెక్టర్‌ గంధం చంద్రుడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

తక్కువ ధరకే మాస్కుల విక్రయాలు

కలెక్టర్‌ గంధం చంద్రుడు


అనంతపురం వ్యవసాయం, మార్చి 24: డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో జిల్లాలో తక్కువ ధరకే మాస్కులు విక్రయించను న్నట్లు కలెక్టర్‌ గంధం చంద్రుడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అనంతపురం నగరంలో 2 కేంద్రాలు, కదిరి, మడకశిర, రాయదుర్గం ప్రాంతాల్లో ఒక్కో కేంద్రంలో మహిళాసంఘాల ద్వారా తక్కువ ధరకే మాస్కులు విక్రయించనున్నామన్నారు. నగరంలోని మారుతీనగర్‌ మూడో క్రాస్‌ లో గణేష్‌, భవానీ స్వయం సహాయక సంఘాలు, కదిరిలో పావని మహిళా సంఘం, మడకశిరలో కళ్యాణి మహిళాసంఘం, రాయదుర్గంలో అమీన్‌ మహి ళా సంఘం ఆధ్వర్యంలో కాటన్‌క్లాత్‌తో మాస్కులు తయారు చేస్తున్నారన్నారు. ఒక్కో మాస్కు రూ.11లకు విక్రయిస్తారన్నారు. కాటన్‌క్లాత్‌తో తయారు చేసిన ఈ మాస్కులను ప్రతిరోజూ శుభ్రం చేసుకుని వాడుకోవచ్చునన్నారు. 

Read more