ఆర్టీఓలో సర్వర్‌ సమస్య !

ABN , First Publish Date - 2020-11-25T06:45:43+05:30 IST

జిల్లాలోని ఆర్టీఓ కార్యాలయాల్లో సర్వర్‌ సమస్య తలెత్తింది. ఐదు రోజులుగా మరింత తీవ్రమైంది. డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం ఎల్‌ఎల్‌ఆర్‌ పరీక్ష రాయాలన్నా, డ్రైవింగ్‌ పరీక్ష పూర్తైన తర్వాత వాహనదారులతో వేలిముద్ర వేయించుకోవాలన్నా అన్నీ ఆన్‌లైన్‌లోనే చేయాలి

ఆర్టీఓలో సర్వర్‌ సమస్య !
ఆర్టీఓ కార్యాలయం


అన్ని రకాల కార్యకలాపాలకు బ్రేక్‌ ..

గంటల తరబడి వాహనదారుల నిరీక్షణ  


అనంతపురం వ్యవసాయం, నవంబరు 24: జిల్లాలోని ఆర్టీఓ కార్యాలయాల్లో సర్వర్‌ సమస్య తలెత్తింది. ఐదు రోజులుగా మరింత తీవ్రమైంది. డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం ఎల్‌ఎల్‌ఆర్‌ పరీక్ష రాయాలన్నా, డ్రైవింగ్‌ పరీక్ష పూర్తైన తర్వాత వాహనదారులతో వేలిముద్ర వేయించుకోవాలన్నా అన్నీ ఆన్‌లైన్‌లోనే చేయాలి. సర్వర్‌ సమస్య తీవ్రంగా వేధిస్తుండటంతో వాహనదారులతోపాటు కార్యాలయ అధికారులు ఇబ్బందిపడుతున్నారు. రోజూ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సర్వర్‌ సతాయిస్తోంది. ఒకసారి కనెక్ట్‌ అయితే అర్ధ గంటపాటు ఆగిపోతోంది. దీంతో ఎల్‌ఎల్‌ఆర్‌ పరీక్షల నిర్వహణ ఇబ్బందిగా మారింది. తక్కువ మంది వాహనదారులు వచ్చినప్పటికీ సాయంత్రం దాకా నిరీక్షించాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నారు. మరోవైపు సర్వర్‌ సమస్యతో ఇతర ఆర్టీఏ కార్యకలాపాలు స్తంభించాయి. ఆన్‌లైన్‌లో పలు రకా  పనుల కోసం డాక్యుమెంట్లు అప్‌లోడ్‌ చేసిన తర్వాత పేమెంట్‌ చేసే సమయంలో సర్వర్‌ బంద్‌ కావ డంతో ఇన్‌సెట్‌లో పడుతోంది. ఈ పరిస్థితుల్లో దరఖా స్తును కేన్సల్‌ చేసుకొని, మరో మారు దరఖాస్తు చేసుకోవా ల్సిన దుస్థితి తలెత్తుతోంది. ఈ సాంకేతిక సమస్యలను సరిచేయడంలో సంబంధిత అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్వర్‌ సమస్యను పరిష్కరించడంపై రాష్ట్ర ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.


సమస్యను అధిగమిస్తాం: శివరాంప్రసాద్‌, డీటీసీ 

రాష్ట్ర వ్యాప్తంగా సర్వర్‌ సమస్య నెలకొంది. ఈ సమస్యను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి సర్వర్‌ సమస్యలను తీసుకు వెళ్లాం. సర్వర్‌ మొరాయించడంతో నెలకొన్న సాంకేతిక సమస్యలను పరిష్కరించడంపై శ్రద్ధ పెడతాం.


Read more