రోజుకు రూ.3 లక్షల నష్టం

ABN , First Publish Date - 2020-07-15T09:48:22+05:30 IST

కరోనా కారణంగా లాక్‌డౌన్‌ అమలులో ఉండడంతో ఆర్టీసీ ఆదాయానికి గండిపడింది.

రోజుకు రూ.3 లక్షల నష్టం

మడకశిర డిపో నుంచి 11 సర్వీసులు.. ఆర్టీసీ ఆదాయానికి కరోనా దెబ్బ


మడకశిర,జూలై 14: కరోనా కారణంగా లాక్‌డౌన్‌ అమలులో ఉండడంతో ఆర్టీసీ ఆదాయానికి గండిపడింది. లాక్‌డౌన్‌ సడలించడంతో మడకశిర డిపో నుంచి 11 సర్వీసులు ప్రారంభించారు. డిపో నుంచి లాక్‌డౌన్‌కు ముందు 36 బస్సు సర్వీసులు వివిధ ప్రాంతాలకు నడుపుతుండేవారు. రోజుకు రూ.4లక్షల దాకా ఆదాయం వచ్చేది. లాక్‌డౌన్‌ అమలులో ఉండటంతో రెండు నెలలుగా రూ.2.40 కోట్ల దాకా నష్టం వాటిల్లింది. లాక్‌డౌన్‌ కొద్దిగా సడలించిన తరువాత 5 సర్వీసులను డిపో నుంచి ప్రారంభించారు. 


15 రోజుల అనంతరం మరో ఆరు సర్వీసులు ప్రారంభించారు. మడకశిర -అనంతపురం 3 ఎక్స్‌ప్రె్‌సలు,  నెల్లూరుకు 2, విజయవాడకు రెండు హై టెక్‌ బస్సులు, పెనుకొండకు ఒక పల్లెవెలుగు, హిందూపురానికి మూడు బస్సులు నడుపుతున్నారు. ప్రయాణికులు రాకపోవడంతో రోజుకు రూ.30 నుంచి 40వేలు కూడా రావడం కష్టంగా మారింది. దీంతో రోజుకు రూ. 3 లక్షల దాకా నష్టం వస్తున్నట్లు స్పష్టమ వుతోంది. లాక్‌డౌన్‌ సడలించిన నేపథ్యంలో సర్వీసులు పొడిగించినా, ప్రయాణికులు రాకపోవడంతో గంటల తరబడి సిబ్బంది వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

Updated Date - 2020-07-15T09:48:22+05:30 IST