లోకేష్ కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారం ఇవ్వాలి : కాలవ
ABN , First Publish Date - 2020-12-30T06:31:20+05:30 IST
గుమ్మఘట్ట మండలం వైద్యం గుండ్లపల్లి రథోత్సవం సందర్భంగా విద్యుత ప్రమాదంలో మృతి చెందిన లోకేష్ కుటుంబానికి విద్యుతశాఖ రూ.5 లక్షలు పరిహారం అందించాలని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు డిమాండ్ చేశారు.

రాయదుర్గం, డిసెంబరు 29 : గుమ్మఘట్ట మండలం వైద్యం గుండ్లపల్లి రథోత్సవం సందర్భంగా విద్యుత ప్రమాదంలో మృతి చెందిన లోకేష్ కుటుంబానికి విద్యుతశాఖ రూ.5 లక్షలు పరిహారం అందించాలని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన గ్రామానికి వెళ్లి లోకేష్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాయదుర్గం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు క్షతగాత్రులను పరామర్శించారు. గాయపడిన వారికి ఒకొక్కరికి రూ.లక్ష పరిహారం చెల్లించాలని కోరారు. కలెక్టర్ బాధితులను ఆదుకోవడంలో ప్రత్యేక చొరవ చూపాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాఘవరెడ్డి, కన్వీనర్ గిరిమల్లప్ప, జడ్పీటీసీ అభ్యర్థి కాలవ సన్నణ్ణ, పట్టణ అధ్యక్షుడు పసుపులేటి నాగరాజు, నాయకులు హనుమంతప్ప, దానవేంద్ర, రంగస్వామి, సదాశివ, మురళి, అంజి, జమీల్‌ఖాన, ఇనాయత బాషా, షమీవుల్లా, ఇస్మాయిల్, ఖలందర్, అహ్మదీ పాల్గొన్నారు.
వెలుగు సభ్యుల ఆర్థిక సాయం
గుమ్మఘట్ట: మండలంలోని వైద్యం గుండ్లపల్లి రథోత్సవం సందర్భంగా విద్యుత ప్రమాదంలో మృతి చెందిన లోకేష్ కుటుంబానికి వెలుగు సిబ్బంది ఆర్థిక సాయం అందించారు. గ్రామంలో మహిళా సంఘ సభ్యులకు యానిమేటర్‌గా పనిచేస్తున్న లోకేష్ అకాల మృతితో మండలంలోని యానిమేటర్లు, వెలుగు సిబ్బంది సంతాపం తెలియజేశారు. రాయదుర్గం ఏరియా కోఆర్డినేటర్ గంగాధర, సీసీలు వన్నూరుస్వామితో పాటు పలువురు మండలంలోని యానిమేటర్లు బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతుడి భార్య చిత్రకు వెలుగు శాఖ తరపున రూ.15 వేలు ఆర్థిక సాయం అందించారు.