రిజర్వేషన్ల జోలికొస్తే తిరుగుబాటే..

ABN , First Publish Date - 2020-12-21T05:16:41+05:30 IST

భారత రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను బీజేపీ తొలగించాలని కుట్రలు చేస్తే తిరుగుబాటు తప్పదని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి (ఆర్‌పీఎస్‌) జా తీయ అధ్యక్షుడు నాగరాజు.. కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆ దివారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

రిజర్వేషన్ల జోలికొస్తే తిరుగుబాటే..

అనంతపురం క్లాక్‌టవర్‌, డిసెంబరు 20: భారత రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను బీజేపీ తొలగించాలని కుట్రలు చేస్తే తిరుగుబాటు తప్పదని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి (ఆర్‌పీఎస్‌) జా తీయ అధ్యక్షుడు నాగరాజు.. కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆ దివారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగం, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు, స్పీకర్లు, ఆర్‌ఎ్‌సఎస్‌ ప్రతినిధులు మాట్లాడుతూ.. 78 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజల మనోభావాలు దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించా రు. బీజేపీకి దమ్ము, ధైర్యం ఉంటే రిజర్వేషన్లు ఎత్తేసి, రాజ్యాంగాన్ని రద్దు చేయాలని సవాల్‌ విసిరారు. కార్యక్రమంలో ఆర్‌పీఎస్‌ జా తీయ ప్రధాన కార్యదర్శి పుల్లయ్య, ఆర్‌ఈఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు నా రాయణనాయక్‌, బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రమోహన్‌, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రధర్‌యాదవ్‌, మేవా అధ్యక్షుడు వేముల బాబు, జీపీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జున నాయక్‌, జిట్టా రామ్మోహన్‌యాదవ్‌, ఆర్‌పీఎస్‌ కృష్ణమోహన్‌, నారాయణస్వామి, ప్రతాప్‌, రామచంద్ర, రామాంజనేయులు, శ్రీకాంత్‌, శివ, చాంద్‌ పాల్గొన్నారు.


Updated Date - 2020-12-21T05:16:41+05:30 IST