జాతీయ లోక్‌ అదాలత్‌లో 1694 కేసుల పరిష్కారం

ABN , First Publish Date - 2020-12-13T06:16:51+05:30 IST

జిల్లా వ్యా ప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో 1694 కేసులు పరిష్కరించారు. లోక్‌ అదాలత్‌ పక్రియను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ అరుణసారిక, కార్యదర్శి దీనబాబు పర్యవేక్షించారు. వారు ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించా రు. స్థానిక జిల్లా కోర్టుతో పాటు జిల్లావ్యాప్తంగా 17 బెంచీలను ఏర్పాటు చేశారు.

జాతీయ లోక్‌ అదాలత్‌లో 1694 కేసుల పరిష్కారం
న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ అరుణసారిక


అనంతపురం క్రైం, డిసెంబరు 12: జిల్లా వ్యా ప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో 1694 కేసులు పరిష్కరించారు. లోక్‌ అదాలత్‌ పక్రియను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ అరుణసారిక, కార్యదర్శి దీనబాబు పర్యవేక్షించారు. వారు ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించా రు. స్థానిక జిల్లా కోర్టుతో పాటు జిల్లావ్యాప్తంగా 17 బెంచీలను ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి సా యంత్రం వరకు ఆన్‌లైన్‌లో సాగిన ఈ ప్రక్రియలో కొవిడ్‌ నిబంధనలు ఉల్లంగించిన క్రిమినల్‌ కేసులు 1574, ఎక్సైజ్‌ 23, సివిల్‌ 28, భరణం 7, ప్రిలిటిగేషన్‌ -5, మోటార్‌ వాహనాలకు సంబంధించి 49, చెక్‌ బౌన్స్‌ 7, కుటుంబ తగాదా కేసులు 1 చొప్పున పరిష్కారమయ్యాయి. లోక్‌ అదాలత్‌ ద్వారా ప్రమాద కేసుల్లో రూ.2.08 కోట్లు, చెక్‌బౌన్స్‌ల పరంగా రూ.19.64 లక్షల నగదు, సివిల్‌ కేసుల పరంగా రూ.3.07 కోట్లు, ఎక్సైజ్‌ కేసుల్లో రూ.5200, భరణానికి సంబంధించి రూ.2818 లక్షల చొప్పున కక్షిదారులకు ఇప్పించేలా రాజీ చేశారు. కొవిడ్‌ నిబంధనల ఉల్లంఘన పరంగా రూ. 13.49 లక్షలు జరిమానాల ద్వారా వసూలు చేశారు.


Updated Date - 2020-12-13T06:16:51+05:30 IST