-
-
Home » Andhra Pradesh » Ananthapuram » Removal of ration cards unfair TDP
-
రేషన్ కార్డులు తొలగించడం అన్యాయం : టీడీపీ
ABN , First Publish Date - 2020-12-15T06:33:24+05:30 IST
రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల రేషన్ కార్డులను తొలగించడానికి రాష్ట్రప్రభుత్వం రంగం సిద్ధంచేసి పూటగడవని పేదల కడుపుకొడుతోందని మాజీ శాసనసభ్యుడు ఆర్ జితేంద్రగౌడు విమర్శించారు.

గుంతకల్లు, డిసెంబరు 14: రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల రేషన్ కార్డులను తొలగించడానికి రాష్ట్రప్రభుత్వం రంగం సిద్ధంచేసి పూటగడవని పేదల కడుపుకొడుతోందని మాజీ శాసనసభ్యుడు ఆర్ జితేంద్రగౌడు విమర్శించారు. సో మవారం స్థానిక తహసీల్దారు కార్యాలయం వద్ద టీడీపీ నాయకులు ధర్నా ని ర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్‌కార్డు ఆధారంగా పేదలకు సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. రేషన్ కార్డు రద్దయితే పేదలకు ఎటువంటి ప్రభుత్వ సాయమూ అందదన్నారు. కార్డును తొలగిస్తే వారి నోటి వద్ద కూడును లాగేయడమేనన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రేషన్ కార్డులను రద్దుపరిచే కార్యక్రమాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌చేశారు. అనంతరం తహసీల్దారు బీ రాముకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు బండారు ఆనంద్, ప్రధాన కార్యదర్శి గుజరీ మహమ్మద్ ఖాజా, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ జీ వెంకటేశులు, మాజీ ఎంపీపీ రాయల రామయ్య, నాయకులు హనుమంతు, ఆమ్లెట్ మస్తాన్ యాదవ్, లక్ష్మినారాయణ, తలారి మస్తానప్ప, జింకల జగన్నాథ్, సిమెంటు నారాయణ, రమేశ్‌గౌడు, దివాకర్ నాయుడు, ఆటో ఖాజా, అంజలి, బీఎస్ శ్రీ ధర్, మహదేవ్, కేఎల్ శీనా పాల్గొన్నారు.