-
-
Home » Andhra Pradesh » Ananthapuram » Registration of cases related to the Batalapalli incident District SP Satyasababu
-
బత్తలపల్లి ఘటనపై కేసుల నమోదు : జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు
ABN , First Publish Date - 2020-03-13T11:03:00+05:30 IST
బుధవారం జరిగిన బత్తలపల్లి ఘటనకు సంబం ధించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన వారిపై కేసులు నమోదు చేశామని జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు పేర్కొన్నారు.

అనంతపురం క్రైం, మార్చి 12: బుధవారం జరిగిన బత్తలపల్లి ఘటనకు సంబం ధించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన వారిపై కేసులు నమోదు చేశామని జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టిందని ఆయన గురువారం ఒక ప్రకటన ద్వారా వివరాలు వెల్లడించారు. జిల్లాలోని ఫ్యాక్షన్, సమస్యాత్మక, తదితర ప్రాంతాల్లో ఆకస్మిక ంగా తనిఖీలు నిర్వహించి 312 అక్రమ మద్యం కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.