కూల్‌ వ్యాపారం డల్‌

ABN , First Publish Date - 2020-03-19T10:41:23+05:30 IST

మా ర్చి వచ్చిందంటే జిల్లాలో మండే ఎండలు మొదలైనట్లే. ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు జిల్లావాసులు ఎన్నో దారులు వెతుకుతారు.

కూల్‌ వ్యాపారం డల్‌

 తగ్గిన కూలర్లు, ఏసీలు, రిఫ్రిజిరేటర్ల అమ్మకాలు..

 కస్టమర్లు లేక షాపులు వెలవెల..


అనంతపురం అర్బన్‌, మార్చి18: మా ర్చి వచ్చిందంటే జిల్లాలో మండే ఎండలు మొదలైనట్లే. ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు జిల్లావాసులు ఎన్నో దారులు వెతుకుతారు. స్థోమతను బట్టి ఏసీలు, కూ లర్లు, రిఫ్రిజిరేటర్లు, చల్లటి నీరిచ్చే మట్టి కుం డలను సమకూర్చుకుంటారు. దీంతో జిల్లాలో మార్చి మొదలైందంటే ఈ వస్తువుల వ్యాపా రం జోరందుకునేది. విపరీతంగా అమ్మకాలు సాగేవి. ఈ ఏడాది పరిస్థితివిరుద్ధంగా ఉం ది. కరోనా వైరస్‌ ప్రతాపంతో కూల్‌ వ్యా పారం డల్‌ అయిపోయింది.కూలర్లు, ఏసీలు, రిఫ్రిజిరేటర్ల అమ్మకాలు భారీగా పడిపోయాయి. గతేడాది కళకళలాడి న వ్యాపారం నేడు వెలవెలబోతోంది. కరోనా వైరస్‌ శీతల ఉష్ణోగ్రతలో జీవించగలదన్న ప్రచారం నేపథ్యంలో ప్రజలు వీటిని కొనడానికి వెనకడుగు వేస్తున్నారు. ఏసీలు, రిఫ్రిజిరేటర్లలో వినియోగించే కంప్రెసర్లు చైనా నుం చి దిగుమతి కావాల్సివుంది. వీటిలో వినియోగించే అల్యూమినియం ఎగుమతిని చైనా ని లిపేసింది. దీంతో దుకాణాల్లో ఏసీలు, రిఫ్రిజిరేటర్ల నిల్వలు తగ్గిపోయాయి. అటో స్వింగ్‌ మోటార్లు, హనీ ప్యాడ్స్‌, కంప్రెసర్లు తదితరా లు చైనా నుంచి దిగుమతి చేసుకోవాలి.


 ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించాలి... సామ్రాట్‌గుప్తా, దివ్య ఎలక్ర్టానిక్స్‌

కూలర్లు, ఏసీలు, రి ఫ్రిజిరేటర్లపై ఎక్సైజ్‌ డ్యూటీని 10 నుంచి 12 శాతాన్ని ప్రభు త్వం పెంచింది. ప్రస్తు తం అమ్మకాలు పూర్తి గా తగ్గిపోయాయి. ఎ క్సైజ్‌ డ్యూటీ తగ్గించాలి. 14 శాతం ఉన్న వ్యాట్‌ను జీఎస్టీ రూపంలో 28 శాతానికి పెంచారు. దీనిని 18 శాతానికి తగ్గించాలి. అప్పుడు అమ్మకాలు పెరిగే వీలుంటుంది.


నెలరోజుల ముందే డబ్బు చెల్లిస్తున్నా.. తరుణ్‌, సేల్స్‌మన్‌, ఆర్‌కే డిజిటల్‌ షాపీ

కూలర్లు, ఏసీలు, రి ఫ్రిజిరేటర్ల ప్రొడక్షన్‌ కంపెనీలు ఈ ఏడాది క్రెడిట్‌ కూడా ఇవ్వట్లే దు. గతంలో ఎంత స రుకు కావాలన్నా సరఫరా చేసేవారు. నెలరోజుల వరకు క్రెడిట్‌ కూడా ఇచ్చేవారు. దీంతో షాపు ఓనర్లకు కొంత ఊరట లభించేది. ప్రస్తుతం నెలరోజులు ముందే డబ్బు చెల్లిస్తున్నా సరఫరా చేయట్లేదు.


గతేడాది వంద కూలర్లు విక్రయించా.. రాజ్‌కుమార్‌, వంశీ ఎలక్ర్టానిక్స్‌

గతేడాది మార్చిలో వంద కూలర్లు అమ్ముడుపోయాయి. ఈ ఏ డాది 18వ తేదీ వ చ్చినా 20 కూలర్లు కూడా విక్రయించలేదు. ఎందుకు ఈ పరిస్థితి దాపురించిందో అర్థం కావట్లేదు. కంపెనీలు అవసరమైన మేర సరుకు సరఫరా చేయట్లేదు. ప్రస్తుతం కొనేవారే కరువయ్యారు.


అమ్మకాలు నిలిచిపోయాయి... జయమ్మ, మట్టికుండల వ్యాపారి

ఎండలు మండిపోతున్నా మట్టి కుండల అమ్మకాలు నిలిచిపోయాయి. పోయిన వే సవిలో రూ.200 ధర తో కూడా అమ్ముడుపోయాయి. ప్రస్తుతం రూ.150కే విక్రయిస్తున్నా కొనటానికి ముం దుకు రావట్లేదు. తయారీదారులు కూడా ఈ దఫా తక్కువ సంఖ్యలో సరఫరా చే స్తున్నా.. సరుకు పేరుకుపోయింది.

Updated Date - 2020-03-19T10:41:23+05:30 IST