నిండా నిర్లక్ష్యం...

ABN , First Publish Date - 2020-07-28T10:33:29+05:30 IST

ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా పేదలకు అందించే రేషన్‌ బియ్యం రోడ్డు పాలయ్యాయి.

నిండా నిర్లక్ష్యం...

రోడ్డుపాలైన పేదల బియ్యం 


చెన్నేకొత్తపల్లి, జూలై27:  ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా పేదలకు అందించే రేషన్‌ బియ్యం రోడ్డు పాలయ్యాయి. పదుల సంఖ్యలో బస్తాలు లారీ నుంచి పడిపోయాయి. చెన్నేకొత్తపల్లి సివిల్‌ సప్లై స్టాక్‌పాయింట్‌ నుంచి మేడాపురం ప్రభుత్వ చౌకదుకాణాలకు చేర్చడానికి 25టన్నుల లోడుతో సోమవారం ఉదయం లారీ బయల్దేరింది. దారిలో జింకలవంక నుంచి వెంకటంపల్లి వరకు 2కిలోమీటర్ల మేర అక్కడక్కడా బియ్యం బస్తాలు లారీ నుంచి జారి పడిపోయాయి. అదే సమయంలో వెనుక మరో లారీలో వస్తున్న వారు గమనించి విషయాన్ని ఇన్‌చార్జి స్టాకిస్ట్‌ కల్యాణ చక్రవర్తికి సమాచారమిచ్చారు. అయితే అప్పటికే రోడ్డుపై పడివున్న బియ్యం బస్తాలను కొందరు ఇళ్లకు ఎత్తుకెళ్లారు. కొంత బియ్యం రోడ్డు పాలైంది.  15బస్తాలు పడిపోయాయని స్టాక్‌ పాయింట్‌ సిబ్బంది చెబుతుండగా, దాదాపు 30 బ స్తాల వరకు పడిపోయివుంటాయని ప్రజలు పేర్కొన్నారు.


దీం తో కొందరు సిబ్బంది ఆలస్యంగా అక్కడకు చేరుకుని బియ్యాన్ని సేకరించే పనిలో పడ్డారు. బియ్యం తరలింపులో ఇంత బాధ్యతారాహిత్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నా రు. దీనిపై తహసీల్దార్‌ నాగేంద్రను వివరణ కోరగా, బస్తా లు పడిపోయిన విషయం తన దృష్టికి వచ్చిందని, స్టాకిస్ట్‌తో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. లోడ్‌ ఎక్కువగా ఉండటం వల్లన పొరపాటున బస్తాలు లారీనుంచి పడిపోయాయన్నారు. మరోసారి ఇలా జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. 

Updated Date - 2020-07-28T10:33:29+05:30 IST