సరుకుల పంపిణీ సవ్యంగా సాగేనా ?
ABN , First Publish Date - 2020-12-03T06:21:25+05:30 IST
జిల్లాలో ఈసారి నిత్యావసర సరకుల పంపిణీ సవ్యంగా సాగేనా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో 16 విడతల్లో ఉచిత సరుకులు పంపిణీ చే శారు.

5 నుంచి సాధారణ పంపిణీకి శ్రీకారం
డీడీలు కట్టని ఎక్కువ మంది డీలర్లు
కంది బ్యాళ్ల ధర పెంచడమే కారణం
ఇప్పటి దాకా అరకొరగానే స్టాక్ సరఫరా
అనంతపురం వ్యవసాయం, డిసెంబరు 2 : జిల్లాలో ఈసారి నిత్యావసర సరకుల పంపిణీ సవ్యంగా సాగేనా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో 16 విడతల్లో ఉచిత సరుకులు పంపిణీ చే శారు. ఈనెల నుంచి సాధారణ సరుకుల పంపిణీ చేసేందుకు నిర్ణయించారు. ఇదివరకు గురువారం నుంచే పంపి ణీ ఆరంభించాలని ఆదేశించారు. ఎఫ్పీ షాపులకు తగిన స్టాక్ పంపలేకపోవడంతో ప్రారంభ తేదీని మార్చారు. తా జాగా ఈనెల 5 నుంచి 16వ తేదీ వరకు సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయించారు. జిల్లాకు ఈ నెలలో 19467 మెట్రిక్ టన్నులు బియ్యం, చక్కెర 565, కంది బ్యాళ్లు 1118 మెట్రిక్ టన్నులు కేటాయించారు. ఇప్పటి దాకా ఎఫ్పీ షాపులకు 18509 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేశారు. అలాగే చక్కెర 417, కంది బ్యాళ్లు 395 మెట్రిక్ టన్నులు సరఫరా చేయడంతో సరిపెట్టారు. సం బంధిత అధికారుల ముందస్తు ప్రణాళికాలోపమే ఇందుకు కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి గోధుమ పిండి సరఫరాను నిలిపివేశారు. గతంలో ఒక్కో కార్డుకు కేజీ గోధుమ పిండి పంపిణీ చేసేవారు. ఈనెలలో గోధుమ పిండి కేటాయించకపోవడం గమనార్హం.
కంది బ్యాళ్లు ధర పెంచడంతో వెనుకంజ
పేదలకు తక్కువ ధరతో అందించాల్సిన కంది బ్యాళ్ల ధరను ప్రభుత్వం అమాంతంగా పెంచి ంది. ఇదివరకు కేజీ కంది బ్యాళ్లు రూ.40లు ఉండేది. ఇటీవల కేజీ ధర రూ.67లకు పెంచారు. ఒక్కో కార్డుకు కేజీ కంది బ్యాళ్లు పంపిణీ చేస్తున్నారు. ఎఫ్పీ షాపుల్లో తక్కువ ధర ఉన్న సమయంలో ఎక్కువ మంది కార్డుదారులు తీసుకునేవారు. ధర పెంచడంతో కార్డుదారులు ఆసక్తి చూపుతారో..? లేదో నన్న అనుమానంతో డీడీలు కట్టేందుకు డీలర్లు వెనుకంజ వేస్తున్నారు. మరోవైపు ఉచిత సరుకుల పంపిణీకి సంబంధించి కమీషన్ మొత్తాన్ని చెల్లించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోంది. 16 విడతల్లో ఇప్పటి దాకా నాలుగు విడతల్లో బియ్యానికి సంబంధించి కమీషన్ను చెల్లించడంతో సరిపెట్టారు. మిగిలిన విడతల్లో పంపిణీకి కమీషన్ ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో ముందస్తుగా డీడీలు కట్టడం భారంగా మారిందని డీలర్లు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో సరుకుల పంపిణీపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.