తప్పని సర్వర్‌ కష్టాలు

ABN , First Publish Date - 2020-11-21T06:24:06+05:30 IST

ఉచిత సరుకుల పంపిణీకి సర్వర్‌ కష్టాలు తప్పట్లేదు. రెండ్రోజులుగా సర్వర్‌ కొంత మేరకు పనిచేసినా మళ్లీ మొరాయించటంతో కార్డుదారులతోపాటు డీలర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

తప్పని సర్వర్‌ కష్టాలు

మళ్లీ మొరాయించటంతో కార్డుదారుల బేజారు

అనంతపురం వ్యవసాయం, నవంబరు 20: ఉచిత సరుకుల పంపిణీకి సర్వర్‌ కష్టాలు తప్పట్లేదు. రెండ్రోజులుగా సర్వర్‌ కొంత మేరకు పనిచేసినా మళ్లీ మొరాయించటంతో కార్డుదారులతోపాటు డీలర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లాలోని ఎఫ్‌పీ షాపుల్లో 16వ విడత ఉచిత సరుకుల పంపిణీ శుక్రవారం నాలుగోరోజు కొనసాగింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం దాకా సర్వర్‌ సరిగా పనిచేయలేదు. దీంతో ఒక్కో ఎఫ్‌పీ షాపులో 20 రేషన్‌ కార్డుల వరకు మాత్రమే సరుకులు అందజేశారు. సర్వర్‌ సమస్యతో గంటల తరబడి కార్డుదారులు నిరీక్షించాల్సి వచ్చింది. జిల్లావ్యాప్తంగా 3012 ఎఫ్‌పీ షాపుల్లో 12.73 లక్షల రేషన్‌కార్డులున్నాయి. నాలుగోరోజు 59714 మందికి సరుకులు అందజేశారు. ఇప్పటిదాకా మొత్తం 3.48 లక్షల మందికి (27.34 శాతం) పంపిణీ చేశారు.

Read more