జిల్లాలో విస్తారంగా వర్షాలు

ABN , First Publish Date - 2020-07-10T10:21:10+05:30 IST

జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో బుధవారం రాత్రి విస్తారంగా వర్షాలు పడ్డాయి. 54 మండలాల్లో చిరుజల్లుల ..

జిల్లాలో విస్తారంగా వర్షాలు

అనంతపురం వ్యవసాయం, జూలై 9: జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో బుధవారం రాత్రి విస్తారంగా వర్షాలు పడ్డాయి. 54 మండలాల్లో చిరుజల్లుల నుంచి భారీ వర్షం కురిసింది. అత్యధికంగా పామిడిలో  58.0 మి.మీ వర్షపాతం నమోదైంది. వజ్రకరూరు 32.0 , గుత్తి 56.4 , పెద్దవడుగూరు 34.4, యాడికి 49.4 , కణేకల్లు 36.0, శింగనమల 29.0,  ఎన్‌పీకుంట 34.0, చిలమత్తూరు 48.6, లేపాక్షి 45.4 మి.మీ వర్షపాతం నమోదైంది. మిగిలిన మండలాల్లో 26 మి.మీలోపు వర్షపాతం నమో దైంది. గురువారం అనంతపురం, తాడిపత్రి, యాడికి, పెద్దవడుగూరు, పుట్లూరు తదితర మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. కళ్యాణదుర్గంలో తుంపర్లు పడ్డాయి. ఈనెల సాధారణ వర్షపాతం 67.4 మి.మీ కాగా ఇప్పటి దాకా 29.1 మి.మీ వర్షపాతం నమోదైంది. 

Updated Date - 2020-07-10T10:21:10+05:30 IST