మద్యం దుకాణాలను మూసివేయాలని నిరసన

ABN , First Publish Date - 2020-05-11T10:26:28+05:30 IST

రాష్ట్రంలో మద్యం దుకాణాలను మూసి వేయాలని ఐద్వా మహిళా సంఘం, డీవైఎ్‌ఫఐ నాయకులు ఆదివారం

మద్యం దుకాణాలను మూసివేయాలని నిరసన

బీకేఎ్‌సలో పలువురు మహిళల అరెస్ట్‌


బుక్కరాయసముద్రం, మే7: రాష్ట్రంలో మద్యం దుకాణాలను మూసి వేయాలని ఐద్వా మహిళా సంఘం, డీవైఎ్‌ఫఐ నాయకులు ఆదివారం  మండల కేంద్రంలోని మద్యం దుకాణాన్ని మూసివేశారు.  మహిళలు ఒక్కసారిగా రోడ్డుపైకి రావడంతో ఉద్రిక్త వాతావరణ ఏర్పడింది. ఈ క్రమంలో మద్యం దుకాణంపైకి చొచ్చుకుని వస్తున్న మహిళలను పోలీసులు బలవంతంగా పక్కకు నెట్టారు. చివరకు ఆందోళన చేపట్టిన మహిళలు, నాయకులను పోలీసులు అరెస్టు చేసి సొంత పూచీకత్తుపై వదిలిపెట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర కోఽశాధికారి సావిత్రి, డీవైఎ్‌ఫఐ  జిల్లా అధ్యక్షులు బాలకృష్ణ, పుల్లయ్య,నాగమ్మ, పద్మ, రామలమ్మ తదితరులు పాల్గొన్నారు. 


కళ్యాణదుర్గం టౌన్‌: మద్యం దుకాణాలను మూసివేయాని డిమాండ్‌ చేస్తూ ఆదివారం మారెంపల్లి కాలనీలో వైన్‌ షాపు ఎదుట ఎస్‌ఎ్‌ఫఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు అచ్యుత్‌ప్రసాద్‌, ఎస్‌ఎ్‌ఫఐ నాయకులు అరవింద్‌, రవి ప్లకార్డులతో నిరసన తెలిపారు. 


వజ్రకరూరు: మద్యం అమ్మకాలు నిలిపివేయాలని మండల కేంద్రంలోని వైన్‌షాపు వద్ద సీపీఎం, ఎస్‌ఎ్‌ఫఐ, జేవీవీ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో సీపీఎం మండల ప్రధాన కార్యదర్శి వీరుపాక్షి, ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు సిద్ధార్థ, జేవీవీ నాయకుడు మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-11T10:26:28+05:30 IST