ప్రభుత్వ వాహనాల పేరుతో ప్రైవేటు దోపిడీ

ABN , First Publish Date - 2020-03-27T09:37:58+05:30 IST

ప్రభుత్వ విధుల్లో ఉన్నామంటూ వాహనాలకు స్టిక్కర్లు అతికించుకుని ప్రైవేటు వాహనదారులు దోపిడీకి తెరలేపారు.

ప్రభుత్వ వాహనాల పేరుతో ప్రైవేటు దోపిడీ

అనంతపురం కార్పొరేషన్‌, మార్చి 26: ప్రభుత్వ విధుల్లో ఉన్నామంటూ వాహనాలకు స్టిక్కర్లు అతికించుకుని ప్రైవేటు వాహనదారులు దోపిడీకి తెరలేపారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రైవేటు వాహనాల రవాణాను పోలీసులు పూర్తిస్థాయిలో కట్టడి చేస్తున్నారు. అయితే తమ వాహనాలకు ఆన్‌ గవర్నమెంట్‌ డ్యూటీ అంటూ రెడ్‌ స్టిక్కర్‌ అతికించి ప్రయాణికులను ఎక్కించుకుని వారితో అదనపు చార్జీలు వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు తిరగకపోవడంతో ప్రయాణికులకు గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడింది. కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల వరకు వాహనాలు తిప్పుతూ సొమ్ము చేసుకుంటున్నారు. కర్నూలు నుంచి జిల్లాలోని హిందూపురానికి  రూ.750లు చొప్పున వసూలు చేస్తున్నట్లు సమాచారం. అలాంటి స్టిక్కర్లున్న వాహనాలను తనిఖీలు చేసి దోపిడీని అరికాట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Updated Date - 2020-03-27T09:37:58+05:30 IST