నిబంధనలు ఉల్లంఘిస్తున్న పవర్‌లూమ్స్‌పై చర్యలు తీసుకోండి
ABN , First Publish Date - 2020-12-17T06:46:54+05:30 IST
చేనేత 11రకాల చట్టాన్ని అమలుచేయకపోవడం వల్ల పవర్‌లూమ్స్‌లో చేనేత రకాలు విచ్చలవిడిగా తయారుచేస్తున్నారని, వారిపై చ ట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఏపీచేనేత కార్మికసంఘం రాష్ట్రప్రధా న కార్యదర్శి పిల్లలమర్రిబాలక్రిష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఏపీ చేనేతకార్మిక సంఘం
రాష్ట్ర ప్రధానకార్యదర్శి బాలక్రిష్ణ
ధర్మవరంఅర్బన్, డిసెంబరు 16: చేనేత 11రకాల చట్టాన్ని అమలుచేయకపోవడం వల్ల పవర్‌లూమ్స్‌లో చేనేత రకాలు విచ్చలవిడిగా తయారుచేస్తున్నారని, వారిపై చ ట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఏపీచేనేత కార్మికసంఘం రాష్ట్రప్రధా న కార్యదర్శి పిల్లలమర్రిబాలక్రిష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు చేనేత సమస్యలను ప రిష్కరించాలంటూ ఏపీ చేనేత కార్మికసం ఘం ఆధ్వర్యంలో బుధవారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట చేనేత కార్మికులతో కలిసి ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు ఏపీ చేనేత కార్మికసంఘం రాష్ట్ర అ ధ్యక్షుడు పోలా రామాంజినేయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1985లో చేనేత కార్మికులకు వృత్తి రక్షణ కోసం 11 రకాల రిజర్వేషన్ చట్టం పార్లమెంట్‌లో ఆమోదించారన్నారు. ఆ చట్టాన్ని అమలుచేయుటకు కేంద్రప్రభుత్వం ఎన్‌పోర్స్‌మెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానం చేస్తూ చేనేతకు కేటాయించిన 11రకాలలో ఒక రకం కూడా పవర్‌లూమ్‌లో తయారుకాకుండా చూసే బాధ్యతను అప్పగించారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల రిజర్వేషన్ చట్టం నీరుగారిపోయిందన్నారు. చేనేతల సమస్యలు పరిష్కరించాలని ఆర్డీఓ మధుసూదన్‌కు వారు వినతిపత్రం అందించారు. ఈకార్యక్రమంలో సీపీఎం పట్టణ కార్యదర్శి జంగాలపల్లిపెద్దన్న, జిల్లా కమిటిసభ్యులు ఎస్‌హెచ్‌బాషా, సీఐటీయూ జిల్లానాయకు లు జేవీరమణ, ఎల్ ఆదినారాయణ, అయూబ్‌ఖాన్, చేనేత నాయకులు ఖాదర్‌బాషా, అన్నంసూరి, ప్రకాశ్, హరి, లక్ష్మీనారాయణ, ఖాదర్‌బాషా, సత్యనారాయణ, రాజు, హనుమంతు పాల్గొన్నారు.