జనావాసాలకు దూరంగా పేదల ఇళ్ల స్థలాలు

ABN , First Publish Date - 2020-12-28T06:43:21+05:30 IST

ప్రభుత్వం పే దలకు ఇళ్ల స్థలాలను జనావాసాలకు దూరంగా ఇవ్వడం భావ్యం కాదని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు.

జనావాసాలకు దూరంగా పేదల ఇళ్ల స్థలాలు
మాట్లాడుతున్న కాలవ శ్రీనివాసులు


మాజీ మంత్రి కాలవ


రాయదుర్గం, డిసెంబరు 27: ప్రభుత్వం పే దలకు ఇళ్ల స్థలాలను జనావాసాలకు దూరంగా ఇవ్వడం భావ్యం కాదని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆదివారం స్థానికంగా నిర్వహించిన తెలుగు మహిళ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణ పేదలకు కేటాయించిన స్థలాల్లో ఎక్కువమంది ఇళ్లు కట్టుకోవడానికి విముఖత చూపుతున్నారన్నారు. సుమా రు 1622 మంది లబ్ధిదారులకు ఎంపిక చేసిన స్థలాలు పట్టణానికి దూరంగా ఉన్నాయన్నారు. బీటీపీ లేఅవుట్‌లో సుమారు 900 పైచిలుకు పట్టాలు పొందిన లబ్ధిదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. సెంటు స్థలంలో ఇళ్లు ఎలా నిర్మించుకోవాలని నిలదీశా రు. అది కూడా పట్టణానికి దూరంగా అనువుకాని చోట అతి తక్కువ విస్తీర్ణంలో నివాసం వుం డటానికి ఎవరికైౖనా మనసెలా ఒప్పుతుందని ప్రశ్నించారు. పేదల పేరుతో వైసీపీ నాయకులు కొందరు కోట్ల రూపాయలు దండుకున్నారని ఆ రోపించారు. ఇళ్ల స్థలాల కోసం అతి తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసి, మూడింతలు ఎక్కువ ధరకు ప్రభుత్వానికి అమ్మారన్నారు. దీని ద్వారా ఎకరా రూ.12 లక్షలకు కొని రూ.40 లక్షలకు ప్రభుత్వానికి అమ్మడం ద్వారా దళారీల ముసుగులోని వైసీపీ నాయకులు స్వాహా చేశారన్నారు. పట్టణాల్లో పేదలు ఇళ్లు నిర్మించుకోవడానికి టీడీపీ ప్రభుత్వం ఒకొక్కరికి రూ.2.50 ల క్షలు సబ్సిడీ అందించిందన్నారు. అయితే ప్రస్తు త జగన ప్రభుత్వం కేవలం రూ.1.80 లక్షలు మాత్రమే ఇస్తోందన్నారు. అందు లో రూ.1.50 లక్షలు కేంద్ర ప్రభుత్వ సొ మ్ము కాగా, కేవలం రూ.30 వేలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద అందించడం ద్వారా పేదలకు తీవ్ర అన్యాయం చేస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా పక్కా ఇళ్ల సబ్సిడీని రూ.2.50 లక్షలుగా నిర్ణయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జగన ప్రభుత్వం పేదలకు చేస్తున్న మోసాలను మహిళల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన సూచించారు.  భవిష్యత్తులో సమస్యల పై మహిళలు పోరాటాలు చేయాలన్నారు. కార్యక్రమంలో ప ట్టణ అధ్యక్షుడు పసుపులేటి నాగరా జు, నాయకులు ముదిగల్లు జ్యోతి, కడ్డిపూడి మహబూబ్‌ బాషా, పొరాళ్లు పురుషోత్తమ్‌, బండి భారతి, ప్రశాంతి, సంపత కుమారి, బళే నాగమణి, సుమలత, కృష్ణవేణమ్మ, మల్లక్క, వడ్డే పద్మ, అ నుదీపిక,  సిమెంటు శీన, జమీల్‌ ఖాన,  ఇనాయత బాషా, బేకరీ తిప్పేస్వామి, బలే శంకర్‌, యల్లప్ప పాల్గొన్నారు.

Updated Date - 2020-12-28T06:43:21+05:30 IST